
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొర్ర తండాలో ఇద్దరు మైనర్ బాలురు దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ మహిళ(40) వస్త్రాలను తొలగించి ఇద్దరు మైనర్లు.. ఆమె నగ్న చిత్రాలను తీశారు.
అనంతరం ఆ ఫొటోలను ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో వారి మిత్రులకు షేర్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఒక మైనర‍్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: సూర్యాపేటలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..?
Comments
Please login to add a commentAdd a comment