తుమకూరు: భర్త మరణించడంతో అతని భార్య దళితురాలు అన్న కారణంతో భర్త కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె రెండున్నర ఏళ్ల కూతురితో కలిసి అత్తవారింటి ముందు ధర్నాకు దిగిన దారుణ ఘటన కర్నాటకలోని తుమకూరు నగరంలోని విద్యా నగరలో జరిగింది. అగ్రవర్ణాలకు చెందిన జితేంద్ర, బోవి సముదాయంకు చెందిన మంజుళ ప్రేమించి 2019 సెప్టెంబర్ 13వ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. అయితే, భర్త జితేంద్ర అక్కలు తీవ్రంగా వ్యతిరేకించారు.
విధి చిన్న చూపు చూసి..
జితేంద్ర నగరంలోని శ్రీశైల ఆగ్రో రైస్ మిల్లును నడిపించేవారు. అయితే ఈ జంటపై విధి చిన్నచూపు చూసింది. కామెర్ల వ్యాధితో జితేంద్ర 4 నెలల కిందట కన్నుమూశాడు. ఆ వెంటనే మంజుళను ఆడపడుచులు, అత్త బలవంతంగా ఇంటి నుంచి గెంటేశారు. నగరంలోని ఓ అద్దె ఇంట్లో తలదాచుకోగా ఆ యజమాని కూడా ఆమెను వెళ్లిపోవాలని కోరాడు. గత్యంతరం లేని ఆమె మళ్లీ భర్త ఇంటికి వెళ్లగా నువ్వు ఇంట్లోకి రావద్దు అని ఐదు మంది ఆడపడుచులు ఆమెను అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాలని ఆ ఇంటి ముందే ఫ్లెక్సీ కట్టుకుని ధర్నా చేపట్టింది. మంజుళకు మద్దతుగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలవారు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment