Daughter in law Dharna
-
విధి వంచితురాలు!
తుమకూరు: భర్త మరణించడంతో అతని భార్య దళితురాలు అన్న కారణంతో భర్త కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె రెండున్నర ఏళ్ల కూతురితో కలిసి అత్తవారింటి ముందు ధర్నాకు దిగిన దారుణ ఘటన కర్నాటకలోని తుమకూరు నగరంలోని విద్యా నగరలో జరిగింది. అగ్రవర్ణాలకు చెందిన జితేంద్ర, బోవి సముదాయంకు చెందిన మంజుళ ప్రేమించి 2019 సెప్టెంబర్ 13వ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. అయితే, భర్త జితేంద్ర అక్కలు తీవ్రంగా వ్యతిరేకించారు. విధి చిన్న చూపు చూసి.. జితేంద్ర నగరంలోని శ్రీశైల ఆగ్రో రైస్ మిల్లును నడిపించేవారు. అయితే ఈ జంటపై విధి చిన్నచూపు చూసింది. కామెర్ల వ్యాధితో జితేంద్ర 4 నెలల కిందట కన్నుమూశాడు. ఆ వెంటనే మంజుళను ఆడపడుచులు, అత్త బలవంతంగా ఇంటి నుంచి గెంటేశారు. నగరంలోని ఓ అద్దె ఇంట్లో తలదాచుకోగా ఆ యజమాని కూడా ఆమెను వెళ్లిపోవాలని కోరాడు. గత్యంతరం లేని ఆమె మళ్లీ భర్త ఇంటికి వెళ్లగా నువ్వు ఇంట్లోకి రావద్దు అని ఐదు మంది ఆడపడుచులు ఆమెను అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాలని ఆ ఇంటి ముందే ఫ్లెక్సీ కట్టుకుని ధర్నా చేపట్టింది. మంజుళకు మద్దతుగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలవారు వచ్చారు. -
అత్తింటి ముందు కొనసాగుతున్న దీక్ష...
నాగోలు : ఆస్తిలో వాటా కావాలని కూతురితో కలిసి అత్తింటి ముందు ధర్నా చేస్తున్న కోడలి దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఎన్టీఆర్నగర్కు చెందిన లింగారెడ్డి అదే ప్రాంతానికి చెందిన దివ్యారెడ్డితో 2009లో వివాహమైంది. లింగారెడ్డి మరో పెళ్లి చేసుకోవడంతో పాటు ఎన్టీఆర్నగర్లో ఉన్న ఇంటిని అమ్మేశాడు. విషయం తెలుసుకున్న దివ్య ఆదివారం అత్తింటివారి ముందు ధర్నాకు దిగింది. అమ్మిన ఇంట్లో తన కూతురి పోషణ కోసం వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో సోమవారం పెద్దమనుషులతో చర్చలు జరిపినా ఫలించకపోవడంతో దీక్ష కొనసాగిస్తోంది. వివరాల్లోకి వెళితే మొదటి భార్యకుతెలియకుండా ఓ ప్రబుద్ధుడు రెండు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. తర్వాత ఇల్లు అమ్ముకుని వెళ్లిపోతుండగా మొదటి భార్య అడ్డుకొని అత్తారింటి వద్ద ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్నగర్కు చెందిన దివ్యకు నల్లగొండజిల్లా పెద్దకొండూరుకు చెందిన లింగారెడ్డితో 2009లో పెళ్లైంది. వీరికి లాస్య అనే పాప ఉంది. లింగారెడ్డి ఎన్టీఆర్నగర్లో స్టేషనరీషాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
అత్తారింటి ముందు కోడలి ధర్నా
-
అత్తారింటి ముందు కోడలి ధర్నా
హైదరాబాద్: మొదటి భార్యకుతెలియకుండా ఓ ప్రబుద్ధుడు రెండు పెళ్లి చేసుకు న్నాడు. తర్వాత ఇల్లు అమ్ముకుని వెళ్లిపోతుండగా మొదటి భార్య అడ్డుకొని అత్తారింటి వద్ద ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్నగర్కు చెందిన దివ్యకు నల్లగొండజిల్లా పెద్దకొండూరుకు చెందిన లింగారెడ్డితో 2009లో పెళ్లైంది. వీరికి లాస్య అనే పాప ఉంది. లింగారెడ్డి ఎన్టీఆర్నగర్లో స్టేషనరీషాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని 8 నెలల క్రితం దివ్య సరూర్నగర్ మహిళా ఠాణాలో కేసు పెట్టింది. పోలీసులు లింగారెడ్డిని రిమాండ్కుతరలించారు. అప్పటి నుంచి దివ్యతల్లి వద్దే ఉంటోంది. బెయిలుపై వచ్చిన లింగారెడ్డి గుట్టుచప్చడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్నగర్లో ఉన్నతమ ఇంటిని లింగారెడ్డితండ్రి మల్లారెడ్డి వేరే వారికి అమ్మేశాడు. ఆదివారం ఉదయం ఆ ఇల్లు ఖాళీ చేసి కుటుంబ సభ్యులంతా వెళ్లిపోతుండగా... దివ్య, ఆమెతల్లి వచ్చి అడ్డుకొని ధర్నాకు దిగారు. వీరికి ప్రజాసంఘాలు, స్థానిక నాయకులు మద్దతుతెలిపారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధ్య?ుడు అ చ్యుతరావు, కార్యదర్శి విజయారెడ్డి వచ్చి లింగారెడ్డి ఇంటితాళం పగులగొట్టి.. దివ్యతో పాటు చిన్నారి లాస్యను ఆ ఇంట్లోకి పంపారు. చట్టం ప్రకారం తండ్రి ఆస్తి కూతురికి చెందుతుందని, కాబట్టి చిన్నారి లాస్యకు ఈ ఇంటిపై పూర్తి హక్కులు ఉంటాయని వారు పేర్కొన్నారు.