
అత్తారింటి ముందు కోడలి ధర్నా
హైదరాబాద్: మొదటి భార్యకుతెలియకుండా ఓ ప్రబుద్ధుడు రెండు పెళ్లి చేసుకు న్నాడు. తర్వాత ఇల్లు అమ్ముకుని వెళ్లిపోతుండగా మొదటి భార్య అడ్డుకొని అత్తారింటి వద్ద ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన దివ్యకు నల్లగొండజిల్లా పెద్దకొండూరుకు చెందిన లింగారెడ్డితో 2009లో పెళ్లైంది. వీరికి లాస్య అనే పాప ఉంది. లింగారెడ్డి ఎన్టీఆర్‌నగర్‌లో స్టేషనరీషాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని 8 నెలల క్రితం దివ్య సరూర్‌నగర్ మహిళా ఠాణాలో కేసు పెట్టింది. పోలీసులు లింగారెడ్డిని రిమాండ్‌కుతరలించారు. అప్పటి నుంచి దివ్యతల్లి వద్దే ఉంటోంది. బెయిలుపై వచ్చిన లింగారెడ్డి గుట్టుచప్చడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్‌నగర్‌లో ఉన్నతమ ఇంటిని లింగారెడ్డితండ్రి మల్లారెడ్డి వేరే వారికి అమ్మేశాడు.
ఆదివారం ఉదయం ఆ ఇల్లు ఖాళీ చేసి కుటుంబ సభ్యులంతా వెళ్లిపోతుండగా... దివ్య, ఆమెతల్లి వచ్చి అడ్డుకొని ధర్నాకు దిగారు. వీరికి ప్రజాసంఘాలు, స్థానిక నాయకులు మద్దతుతెలిపారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధ్య?ుడు అ చ్యుతరావు, కార్యదర్శి విజయారెడ్డి వచ్చి లింగారెడ్డి ఇంటితాళం పగులగొట్టి.. దివ్యతో పాటు చిన్నారి లాస్యను ఆ ఇంట్లోకి పంపారు. చట్టం ప్రకారం తండ్రి ఆస్తి కూతురికి చెందుతుందని, కాబట్టి చిన్నారి లాస్యకు ఈ ఇంటిపై పూర్తి హక్కులు ఉంటాయని వారు పేర్కొన్నారు.