NTR nagar
-
ఎల్బీనగర్లో పోలీసుల కార్డెన్ సెర్చ్
-
రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం
పెద్దాపురం: ప్రజా సంక్షేమ పాలన సాగించిన దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన ఆయన తనయుడు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పట్టణ ఎన్టీఆర్ నగర్ వాసులు సుమారు 150 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుబ్బారావు నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో రాజా మాట్లాడుతూ హైటెక్ పాలన పేరుతో ప్రజలను మభ్య పెడుతున్న చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కోఆర్డినేటర్ సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం పెద్దాపురం నియోజవర్గంలో మట్టి మాఫియా, అవినీతి పాలన రాజ్యమేలుతుందన్నారు. నాడు తోట గోపాలకృష్ణ హయాంలో రాజీవ్ గృహకల్ప నిర్మిస్తే సిగ్గు లేకుండా ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టుకుని గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్ర నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, జిగిని వీరభద్రరావు, ఆవాల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు రమేష్‌రెడ్డి, పెదిరెడ్ల రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. అనంతరం ఆ వార్డు నాయకులు ధరణికోట యోహాను, తుమ్మల వాసుల ఆ«ధ్వర్యంలో కాలనీకి చెందిన కడియాల సత్తిబాబు, దూలం పెద్ద, సిమ్మ అప్పారావు, గుమ్మడి వీర్రాజు, అక్షింతల గంగాధర్, కడియాల కుమారి, సుందరపల్లి వీర వరలక్ష్మి, యర్రా శ్రీను, మంతా గోవిందు, షేక్ పయ్యాన్, బత్తుల తాతారావులతోపాటు సుమారు 100 మంది పురుషులు , 50 మంది మహిళలు పార్టీలో చేరగా వారికి జక్కంపూడి రాజా, సుబ్బారావు నాయుడులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేకా శ్రీను, విడదాసరి రాజా, గోపు మురళి, గుర్రాల యాకోబు, పేర్నేడి ఈశ్వరరావు, జిగిని రాజుబాబు, ఉద్దగిరి సతీష్, శెట్టిబత్తుల దుర్గారావు, కొల్లి రాజు, సేపేని సురేష్, కందుల వెంకటాచలం, గుణ్ణం రామ్మోహన్, పల్లా శ్రీనివాస్ యాదవ్, దేవాడ శ్రీనివాసరెడ్డి, నందిక లోవరాజు, నీలం రామకృష్ణ, అధిక సంఖ్యలో ఎన్టీఆర్ కాలనీవాసులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ నగర్
-
బీజేపీ కార్యకర్తలపై దాడి
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అఖిలపక్ష పార్టీలు చేస్తున్న బంద్ లో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికంగా బంద్ లో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలపై ఓ షాపు యజమాని కత్తితో దాడి చేశాడు. బంద్ సందర్భంగా షాపులు మూయిస్తున్న కార్యకర్తలపై ఒక్కసారిగా దాడిచేశాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహంతో యజమానిని కార్యకర్తలు చితకబాదారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్తింటి ముందు కొనసాగుతున్న దీక్ష...
నాగోలు : ఆస్తిలో వాటా కావాలని కూతురితో కలిసి అత్తింటి ముందు ధర్నా చేస్తున్న కోడలి దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఎన్టీఆర్నగర్కు చెందిన లింగారెడ్డి అదే ప్రాంతానికి చెందిన దివ్యారెడ్డితో 2009లో వివాహమైంది. లింగారెడ్డి మరో పెళ్లి చేసుకోవడంతో పాటు ఎన్టీఆర్నగర్లో ఉన్న ఇంటిని అమ్మేశాడు. విషయం తెలుసుకున్న దివ్య ఆదివారం అత్తింటివారి ముందు ధర్నాకు దిగింది. అమ్మిన ఇంట్లో తన కూతురి పోషణ కోసం వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో సోమవారం పెద్దమనుషులతో చర్చలు జరిపినా ఫలించకపోవడంతో దీక్ష కొనసాగిస్తోంది. వివరాల్లోకి వెళితే మొదటి భార్యకుతెలియకుండా ఓ ప్రబుద్ధుడు రెండు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. తర్వాత ఇల్లు అమ్ముకుని వెళ్లిపోతుండగా మొదటి భార్య అడ్డుకొని అత్తారింటి వద్ద ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్నగర్కు చెందిన దివ్యకు నల్లగొండజిల్లా పెద్దకొండూరుకు చెందిన లింగారెడ్డితో 2009లో పెళ్లైంది. వీరికి లాస్య అనే పాప ఉంది. లింగారెడ్డి ఎన్టీఆర్నగర్లో స్టేషనరీషాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
అత్తారింటి ముందు కోడలి ధర్నా
-
అత్తారింటి ముందు కోడలి ధర్నా
హైదరాబాద్: మొదటి భార్యకుతెలియకుండా ఓ ప్రబుద్ధుడు రెండు పెళ్లి చేసుకు న్నాడు. తర్వాత ఇల్లు అమ్ముకుని వెళ్లిపోతుండగా మొదటి భార్య అడ్డుకొని అత్తారింటి వద్ద ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్నగర్కు చెందిన దివ్యకు నల్లగొండజిల్లా పెద్దకొండూరుకు చెందిన లింగారెడ్డితో 2009లో పెళ్లైంది. వీరికి లాస్య అనే పాప ఉంది. లింగారెడ్డి ఎన్టీఆర్నగర్లో స్టేషనరీషాపు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని 8 నెలల క్రితం దివ్య సరూర్‌నగర్ మహిళా ఠాణాలో కేసు పెట్టింది. పోలీసులు లింగారెడ్డిని రిమాండ్కుతరలించారు. అప్పటి నుంచి దివ్యతల్లి వద్దే ఉంటోంది. బెయిలుపై వచ్చిన లింగారెడ్డి గుట్టుచప్చడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్నగర్లో ఉన్నతమ ఇంటిని లింగారెడ్డితండ్రి మల్లారెడ్డి వేరే వారికి అమ్మేశాడు. ఆదివారం ఉదయం ఆ ఇల్లు ఖాళీ చేసి కుటుంబ సభ్యులంతా వెళ్లిపోతుండగా... దివ్య, ఆమెతల్లి వచ్చి అడ్డుకొని ధర్నాకు దిగారు. వీరికి ప్రజాసంఘాలు, స్థానిక నాయకులు మద్దతుతెలిపారు. సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధ్య?ుడు అ చ్యుతరావు, కార్యదర్శి విజయారెడ్డి వచ్చి లింగారెడ్డి ఇంటితాళం పగులగొట్టి.. దివ్యతో పాటు చిన్నారి లాస్యను ఆ ఇంట్లోకి పంపారు. చట్టం ప్రకారం తండ్రి ఆస్తి కూతురికి చెందుతుందని, కాబట్టి చిన్నారి లాస్యకు ఈ ఇంటిపై పూర్తి హక్కులు ఉంటాయని వారు పేర్కొన్నారు. -
100 శాతం వికలత్వం ఉన్నా అందని పింఛన్, ట్రైసైకిల్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఈ ఫొటోలోని మహిళ పేరు రాధ. ఆదోనిలోని ఎన్టీఆర్ నగర్లో నివాసం. ఐదేళ్ల ప్రాయం వరకూ అందరిలాగే ఆడిపాడింది. అయితే విధి వక్రించడంతో రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయింది. తోటి పిల్లలు ఆడుకుంటుంటే ఉన్నచోటు నుంచి కదలలేని తన స్థితిని తలచుకుని కన్నీటి పర్యతమయ్యేది. అయినా తల్లిదండ్రులు ఉన్నారనే ధైర్యంతో జీవితం ఆశలు పెంచుకుంది. 100 శాతం వికలత్వం ఉండడంతో పింఛన్, ్రైటె సైకిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. అధికారులు స్పందించకపోవడంతో ఫలితం కనిపించలేదు. అనారోగ్యంతో పదేళ్ల క్రితం తండ్రి, ఐదేళ్ల క్రితం తల్లి ప్రాణాలు కోల్పోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆమె పింఛన్ కోసం మళ్లీ.. మళ్లీ దరఖాస్తులు చేసుకుంది. అయినా ఆ విధి వంచితురాలిపై అధికారులు కరుణ చూపలేదు. పింఛన్ మంజూరు కాలేదు. గత్యంతరం లేని స్థితిలో తన చెల్లెలు లక్ష్మి(11)తో కలిసి పెద్దనాన్న ఇంట్లో చేరింది. సమీప బంధువైన కుమార్ ఆమె పరిస్థితి తెలుసుకుని మానవతాదృక్పథంతో ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. అతను రైల్వేస్టేషన్‌లోని క్యాంటీన్లో పని చే స్తూ భార్యను పోషించుకుంటున్నాడు. వికలాంగులను వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ.50 ప్రోత్సాహకం అందిస్తుందని తెలుసుకుని శుక్రవారం అతి కష్టం మీద కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వికలాంగుల శాఖ ఏడీ వరప్రసాద్‌ను కలిసి దరఖాస్తు పత్రం అందజేశారు. అయితే ప్రోత్సాహకాల బడ్జెట్ విడుదల కాక రెండేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో వారికి ప్రోత్సాహం అందడం కూడా అనుమానమే. -
బ్లాక్‌లో బ్లూ
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగరంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన నారాయణమ్మది చిన్న కుటుంబం. ఆమె భర్త వస్త్ర దుకాణంలో గుమాస్తా. ఈ కుటుంబం రేషన్ సరుకులపై ఆధారపడి జీవిస్తోంది. ప్రతినెలా సమీపంలోని ప్రభుత్వ చౌకదుకాణంలో బియ్యం, నూనెతో పాటు కిరోసిన్ కూడా తెచ్చుకుంటారు. కొన్ని నెలలుగా వారికి కిరోసిన్ ఇవ్వడం లేదు. దీనిపై డీలర్‌ను నారాయణమ్మ ప్రశ్నించగా స్టాక్ అయిపోయిందని చెప్పడంతో ఏం చేయలేక ఆమె అయోమయానికి గురైంది. ఇలాంటి వారు జిల్లాలో చాలా మందే ఉన్నారు. వీరికి కేటాయించిన కిరోసిన్ కోటాను రేషన్ డీలర్లు స్వాహా చేస్తున్నారు. జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ సొమ్ముస్వాహా చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. పేదలకు చేరాల్సిన నీలి(బ్లూ) కిరోసిన్ నల్లబజారుకు తరలుతోంది. ఈ తంతు విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లు సిండికేట్‌గా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరికి పౌరసరఫరాల అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 19 మంది హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లు ఉన్నారు. వీరికి ప్రతి నెలా వివిధ ఆయిల్ కంపెనీల ద్వారా 1428 కిలోలీటర్లు కిరోసిన్ సరఫరా అవుతోంది. హోల్‌సేల్ కిరోసిన్ డీలర్ల ద్వారా జిల్లాలోని 1888 రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రేషన్‌డీలర్ల ద్వారా కార్డుదారులకు కేటాయించిన ప్రకారం కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది. కేటాయింపులో తిరకాసు ప్రతి రేషన్ డీలర్‌కు కార్డు సంఖ్యను అనుసరించి కిరోసిన్ కేటాయింపు జరగాల్సి ఉంది. అయితే కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లు పౌరసరఫరాల అధికారులతో కుమ్మక్కై ఒక్కో డీలర్‌కు 50 నుంచి 100 లీటర్ల వరకు కోత వేసి సరఫరా చేస్తున్నట్టు పలువురు డీలర్లు వాపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న డీలర్లకు కేటాయింపులు పెంచి వారి ద్వారా అధికారులు అందిన మేరకు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. కేటాయింపుపై పలువురు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా అధికారులు దాట వేస్తున్నట్టు సమాచారం. జిల్లాలో 7,82,139 మంది కార్డుదారులు ఉన్నారు. వీరిలో గ్యాస్ లేని వారికి రెండులీటర్లు, గ్యాస్ ఉన్నవారికి ఒక లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయాల్సి ఉంది. రెండులీటర్ల కిరోసిన్ కార్డుదారులు 6,41,334 మంది, లీటర్ కిరోసిన్దారులు 1,40,805 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా సక్రమంగా కిరోసిన్ పంపిణీ కావడం లేదు. ఫలితంగా పేదలకు కిరోసిన్ కష్టాలు తప్పడం లేదు. పెట్రోలు బంకులకు తరలుతున్న కిరోసిన్ కొందరు హోల్‌సేల్ డీలర్లు కిరోసిన్‌ను పెట్రోలు బంకులకు అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నీలి కిరోసిన్‌ను ఆయా బంకుల యజమానులు పెట్రోలు, డీజిల్‌లో నీలి కిరోసిన్‌ను కల్తీ చేస్తున్నారు. దీంతో పెట్రోలు బంకుల యజమానులు వాహనదారులను నిలువునా మోసం చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. జిల్లాలో ఎక్కడా కిరోసిన్, పెట్రోలు,డీజిల్ బంకులపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఒక వేళ చేసినా నామమాత్రమే. ఇకనైనా ఉన్నతాధికారులు హోల్‌సేల్ కిరోసిన్, పెట్రోలు, డీజిల్ బంకుల అక్రమాలపై దృష్టి సారించాల్సి ఉంది.