కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఈ ఫొటోలోని మహిళ పేరు రాధ. ఆదోనిలోని ఎన్‌టీఆర్ నగర్‌లో నివాసం. ఐదేళ్ల ప్రాయం వరకూ అందరిలాగే ఆడిపాడింది. అయితే విధి వక్రించడంతో రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయింది. తోటి పిల్లలు ఆడుకుంటుంటే ఉన్నచోటు నుంచి కదలలేని తన స్థితిని తలచుకుని కన్నీటి పర్యతమయ్యేది. అయినా తల్లిదండ్రులు ఉన్నారనే ధైర్యంతో జీవితం ఆశలు పెంచుకుంది.
100 శాతం వికలత్వం ఉండడంతో పింఛన్, ్రైటె సైకిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. అధికారులు స్పందించకపోవడంతో ఫలితం కనిపించలేదు. అనారోగ్యంతో పదేళ్ల క్రితం తండ్రి, ఐదేళ్ల క్రితం తల్లి ప్రాణాలు కోల్పోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆమె పింఛన్ కోసం మళ్లీ.. మళ్లీ దరఖాస్తులు చేసుకుంది. అయినా ఆ విధి వంచితురాలిపై అధికారులు కరుణ చూపలేదు. పింఛన్ మంజూరు కాలేదు. గత్యంతరం లేని స్థితిలో తన చెల్లెలు లక్ష్మి(11)తో కలిసి పెద్దనాన్న ఇంట్లో చేరింది.
సమీప బంధువైన కుమార్ ఆమె పరిస్థితి తెలుసుకుని మానవతాదృక్పథంతో ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. అతను రైల్వేస్టేషన్‌లోని క్యాంటీన్‌లో పని చే స్తూ భార్యను పోషించుకుంటున్నాడు. వికలాంగులను వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ.50 ప్రోత్సాహకం అందిస్తుందని తెలుసుకుని శుక్రవారం అతి కష్టం మీద కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వికలాంగుల శాఖ ఏడీ వరప్రసాద్‌ను కలిసి దరఖాస్తు పత్రం అందజేశారు. అయితే ప్రోత్సాహకాల బడ్జెట్ విడుదల కాక రెండేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో వారికి ప్రోత్సాహం అందడం కూడా అనుమానమే.
100 శాతం వికలత్వం ఉన్నా అందని పింఛన్, ట్రైసైకిల్
Published Sat, Nov 23 2013 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement