హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అఖిలపక్ష పార్టీలు చేస్తున్న బంద్ లో భాగంగా నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికంగా బంద్ లో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలపై ఓ షాపు యజమాని కత్తితో దాడి చేశాడు. బంద్ సందర్భంగా షాపులు మూయిస్తున్న కార్యకర్తలపై ఒక్కసారిగా దాడిచేశాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహంతో యజమానిని కార్యకర్తలు చితకబాదారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బీజేపీ కార్యకర్తలపై దాడి
Published Sat, Oct 10 2015 12:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement