
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం టీపీటీఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, కార్యదర్శి మైస శ్రీనివాసులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీల్లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. నాలుగు నెలలు కావస్తున్నా.. ఈ సమస్యని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని, వారంలోగా పరిష్కరించకుంటే ఉద్యమిస్తామన్నారు. బదిలీల వ్యవహారంలో చిన్న ఉద్యోగులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment