సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులపై వేటు వేసేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేప ట్టింది. టీచర్ల వెబ్ కౌన్సెలింగ్‌లో జరిగిన పొరపాట్ల సర్దుబాటులో పలువురు టీచర్ల నుంచి విద్యా శాఖ అప్పీళ్లు స్వీకరించింది. ఈ అప్పీళ్లను పరిశీలించి కొన్నింటికి ఆమోదం తెలుపుతూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచా ర్య ఉత్తర్వులు జారీ చేశారు. దీని ఆధారంగా పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్ బదిలీ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో కొందరు ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వం ఆమోదించిన అప్పీళ్లతోపాటు తిరస్కరించిన అప్పీళ్లనూ చొప్పి ంచారు. ఇలా దాదాపు 17 మంది టీచర్లకు అక్రమంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘ఉపాధ్యాయ బదిలీల్లో ఉన్నతాధికారులకు ఝలక్’అనే శీర్షికతో ఈ నెల 8న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేశారు.
ముగ్గురికి నోటీసులు..: బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులకు ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌తోపాటు సెక్షన్ సూపరింటెండెంట్, క్లరికల్ ఉద్యోగి ఉన్నారు. వీరంతా వివరణ ఇవ్వాల్సిందిగా ఆమె ఆదేశించారు. ఈ క్రమ ంలో వారి నుంచి వివరణ తీసుకున్న అధికారులు ఆ ఫైలును పాఠశాల విద్యా శాఖ సంచాలకుల కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైలు డైరెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తిరస్కరించిన అప్పీళ్లకు ప్రాంతీయ కార్యాలయంలో ఎలా ఆమోదించారనే అంశాన్నీ విద్యా శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. మొత్తంగా దసరా తర్వాత వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
‘ఝలక్’ ఇచ్చిన ఉద్యోగులకు షాక్..!
Published Wed, Oct 17 2018 1:11 AM | Last Updated on Wed, Oct 17 2018 1:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment