టీచర్ల బదిలీల వ్యాజ్యాలపై తీర్పు వాయిదా | Hyderabad High Court reserves verdict on teachers' transfers | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీల వ్యాజ్యాలపై తీర్పు వాయిదా

Published Fri, Jun 22 2018 1:58 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

Hyderabad High Court reserves verdict on teachers' transfers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాల్‌ చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం నిర్ణయాన్ని వెల్లడించింది. ‘‘బదిలీ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి.

ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఉత్తర్వుల్ని యథాతథంగా ఉంచాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో బదిలీ ఉత్తర్వుల్ని రద్దు చేయాలి’’.. అని ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున సీనియర్‌ న్యాయవాది రామచంద్రరావు, జెడ్పీ టీచర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సురేందర్‌రావు వాదించారు. ‘‘డీఈవో లేని చోట్ల ఉపాధ్యాయులను బదిలీచేసే అధికారం ఆర్‌జేడీలకు అప్పగించాం.

పూర్వపు పది జిల్లాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుగుతాయి. పైరవీలకు ఆస్కారం లేదనే కొందరు కావాలని బదిలీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వ్యా జ్యాలను కొట్టివేసి బదిలీలు జరిగేలా చేయాలి’’ అని సర్కార్‌ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు ప్రతివాదన చేశారు. వాదన ల అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. 26లోగా వీటిపై తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని« దర్మాసనం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement