మూడు లక్షల మంది అనర్హులు పింఛను పొందుతున్నారు
పెండింగ్‌లో 2.5 లక్షల పింఛన్ దరఖాస్తులు
అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
నకిలీ సర్టిఫికేట్లతో కొందరు దివ్యాంగుల పింఛన్ తీసుకుంటున్నారు: స్పీకర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. అనర్హత పేరుతో మూడు లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు గురువారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు.
3 లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, 2.5 లక్షలు కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి బదులిచ్చారు. దివ్యాంగులు కానివారు కొంతమంది డాక్టర్ల ద్వారా నకిలీ సరి్టఫికేట్ పొంది పింఛన్లు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయని, వాటన్నింటినీ తనిఖీ చేసి అనర్హులను తొలగిస్తామని మంత్రి వివరించారు.
ఎస్సీ, ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మంత్రి చెప్పాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రశ్నించారు. కానీ ఈ ప్రశ్నకు మంత్రి కొండపల్లి స్పందించలేదు. విశాఖలో భూ కుంభకోణాలపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ లేదా హౌస్ కమిటీ వేయాలని సంబంధిత మంత్రికి స్పీకర్ సూచించారు.
విశాఖలోని రుషికొండలో నిరి్మంచిన భవనాల నిర్మాణ ఖర్చులు రూ.409.39 కోట్ల వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో వివరించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ రుషికొండలో భవనాలు కూల్చేయాలన్న పిటిషన్‌ను వెనక్కితీసుకుంటామని చెప్పారు.
సీట్లు కేటాయించండి అధ్యక్షా!
పారీ్టలు మారినట్లు అసెంబ్లీలో సీట్లు మారుతుంటే కష్టంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సభలో ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యులకు ఎవరి సీట్లు వారికి కేటాయిస్తే బాగుంటుందని ఆయన స్పీకర్‌ను కోరారు. అంతా మన హౌసే కదా... అని స్పీకర్ చెప్పగా... అయినా కూడా ఎవరి సీట్లు వాళ్లకు ఇవ్వాలని బుచ్చయ్య స్పష్టంచేశారు.
డిసెంబర్‌లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో సమీక్ష జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment