మూడో తేదీకి కూడా టీచర్లకు జీతాలు ఇవ్వని ప్రభుత్వం
రూ.5,000 కోట్లు అప్పు చేసినా వేతనాలు చెల్లించని చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు(Salaries), పెన్షన్లు(pensions) చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)... దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోను మూడో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు. రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేసింది. అయితే 3వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు.
జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. యూనివర్సిటీల ప్రొఫెసర్లకు కూడా ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు మరికొన్ని శాఖల్లో పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందలేదు.
ప్రభుత్వం గత నెల 31వ తేదీ మంగళవారం రూ.5,000 కోట్లు అప్పు చేసినప్పటికీ తమకు వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమని ఉపాధ్యాయులు అంటున్నారు. వేతనాలు అందకపోవడంతో పిల్లల ఫీజులు, ఈఎంఐ చెల్లింపులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఒక నెల మాత్రమే కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, ఆ తర్వాత నుంచి ఏ నెలలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లు అందరికీ ఒకటో తేదీన వేతనాలు ఇవ్వలే
Comments
Please login to add a commentAdd a comment