
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌లో కొత్తగా 64,880 మందికి పింఛన్లు మంజూరు చేసింది. వీటిలో 1,270 ఆరోగ్య పింఛన్లు, 63,610 ఇతర పింఛన్లు ఉన్నాయి. కొత్తగా మంజూరుచేసిన వాటితో కలిపి నవంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,94,243 మందికి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.1,499.89 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఆదివారం వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి పింఛను డబ్బు అందజేయనున్నారు.