దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ  | Pensions in Secretariats from Wednesday afternoon | Sakshi
Sakshi News home page

దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ 

Published Thu, Apr 4 2024 5:10 AM | Last Updated on Thu, Apr 4 2024 11:08 AM

Pensions in Secretariats from Wednesday afternoon - Sakshi

చంద్రబాబు అండ్‌ కో కుట్రలను అధిగమించి పింఛన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం 

బుధవారం మధ్యాహ్నం నుంచే సచివాలయాల్లో అవ్వాతాతలకు పింఛన్లు

ఆరు గంటల్లోనే 26,00,064 మందికి రూ.785.25 కోట్లు పంపిణీ 

మరో 3 రోజులు కొనసాగనున్న పంపిణీ  

బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. వలంటీర్ల బంధాన్ని బాబు అండ్‌ కో తెంచడంతో ఆ సమాచారం తెలియక వృద్ధులకు ఇబ్బందులు 

ఎక్కువగా అనారోగ్య సమస్యలున్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి ఇంటి వద్దే పింఛన్‌ ఇస్తామన్న అధికారులు

సాక్షి, అమరావతి: సంకల్పం ఉంటే ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు అండ్‌ కో ఎన్ని అడ్డంకులు సృష్టించినా, దిగ్విజయంగా ముందుకు సాగుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. పింఛన్ల విషయంలోనూ పచ్చ గ్యాంగు కుట్రలకు ఏమాత్రం వెరవకుండా అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు ఠంఛన్‌గా పింఛన్లు అందజేసింది.

ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి చంద్రబాబు అండ్‌ కో వలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పించి ఆటంకాలు సృష్టించినా.. ప్రభుత్వం అవ్వాతాతలకు ఠంఛన్‌గా పింఛన్‌ డబ్బులను అందజేసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీని ప్రారంభించి, కేవలం ఆరు గంటల్లోనే 26,00,064 మంది లబ్దిదారులకు రూ. 785.25 కోట్లు అందజేసింది. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్లు అందజేస్తున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌ నేతృత్వంలోని సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ సంస్థ చేసిన ఫిర్యాదుల మేరకు మార్చి 30న కేంద్ర ఎన్నికల సంఘం ఇ చ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వలంటీర్లను ఈ కార్యక్రమం నుంచి పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో ప్రశాంతంగా సాగుతున్న పింఛన్ల పంపిణీలో హఠాత్తుగా గందరగోళం నెలకొంది.

అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే ప్రత్యామ్నాయ పద్ధతులను రూపొందించింది. మంగళవారం రాత్రికే రాష్ట్రంలోని అన్ని సచివాలయాలకు వాటి పరిధిలోని లబ్దిదారుల సంఖ్యకు అనుగుణంగా పింఛన్ల నిధులను విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. సచివాలయాల సిబ్బంది బుధవారం బ్యాంకులు తెరిచిన తర్వాత  డబ్బులు డ్రా చేసి, మధ్యాహ్నం 12.30  నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. రాత్రి ఏడు గంటల వరకు పింఛన్ల పంపిణీ కొనసాగిందని అధికారులు తెలిపారు. 

39.58 శాతం మేర పంపిణీ పూర్తి 
ఏప్రిల్‌ నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 66 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ. 1,951.69 కోట్లు విడుదల చేయగా,  బుధవారం రాత్రి వరకు 26,00,064 మందికి రూ. 785.25 కోట్లను సచివాలయాల సిబ్బంది పంపిణీ చేశారు. మొత్తం 39.58 శాతం మందికి పింఛన్లు అందాయి. మరో మూడు రోజులు సచివాలయాల వద్ద ఈ పంపిణీ కొనసాగుతుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌ చైర్‌కు పరిమితమైన వారికి తప్పనిసరిగా వారి ఇంటి వద్దనే పంపిణీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారమే 54.82 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు ఆ జిల్లాలో 3,16,492 మంది లబ్ధిదారులు ఉండగా, బుధవారం రాత్రి వరకు 1,73,485 మందికి పంపిణీ పూర్తయింది. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలోనూ 52.13 శాతం, వైఎస్సార్‌ కడప జిల్లాలో 50.42 శాతం, ఏలూరు జిల్లాలో 48.88 శాతం, ప్రకాశం జిల్లాలో 46.60 శాతం, తిరుపతి జిల్లాలో 46.26 శాతం చొప్పన పంపిణీ పూర్తయినట్టు అ«ధికారులు వివరించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కువ భాగం ఆఫ్‌లైన్‌ విధానంలో పంపిణీ జరుగుతున్నందున, ఆ వివరాలు అందాల్సి ఉందని అధికారులు వివరించారు. 

నేడు ఉదయం 7 గంటల నుంచే పింఛన్ల పంపిణీ
వేసవి, వేడి గాలుల నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించినట్లు చెప్పారు. ఈ విభాగాల పింఛన్‌దారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  

బంధం తెంచిన బాబుబుధవారం మధ్యాహ్నం తర్వాత పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కొత్త మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. వలంటీర్లు ఉండి ఉంటే ఈ సమాచారం వెంటనే లబ్ధిదారులకు తెలిసి ఉండేది. వలంటీర్లు లేకపోవడంతో వారికి సరైన సమాచారం అందలేదు. తాజా మార్గదర్శకాల గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసినా, ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యే అవ్వాతాతలకు స్పష్టంగా తెలియలేదు. దీంతో లబ్దిదారులు బుధవారం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు చేరుకోవడంతో కొంత గందరగోళం నెలకొందని అధికారులు చెప్పారు. 2019 ఆగస్టులో రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల వివరాలను నేరుగా వలంటీర్ల ద్వారా సంబంధిత లబ్దిదారులకు సకాలంలో, స్పష్టంగా అందుతుండేదని అధికారులు చెప్పారు.

లబ్దిదారులకు ఏదైనా సహకారం అవసరమైనా వలంటీర్లు అందించేవారని తెలిపారు. హఠాత్తుగా వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల నుంచి తప్పించడంతో ఇప్పుడు వారి ద్వారా సమాచారం తెలిసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, ఆ కారణంగా పింఛన్ల పంపిణీ బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలవుతుందన్న ప్రభుత్వ సమాచారం కూడా లబ్దిదారులకు తెలియలేదని అధికారులు వివరించారు. నాలుగున్నరేళ్లకు పైగా ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వలంటీర్ల బంధాన్ని చంద్రబాబు అండ్‌ కో తెంచడంతో పేదలకు ఈ ఇబ్బందులు వచ్చాయని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement