కంచనపల్లి (రఘునాథపల్లి) : బ్యాంకులో డ్రా చేసిన డబ్బులు సినీ ఫక్కీలో చోరీ చేశారు. ఈ సంఘటన కంచనపల్లి సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోవర్దనగిరికి చెందిన సంపతి మాధవరెడ్డి తన కూతురు అనిత పెళ్లి మే 1న కుదుర్చుకున్నాడు. పెళ్లి కోసం తండ్రి ధర్మారెడ్డి, తన పేరుపై పాలసీల పట్టాలపై రుణంకోసం జనగామ ఎల్‌ఐసీ కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నాడు.
తండ్రి, కొడుకులు కంచనపల్లి సెంట్రల్ బ్యాంకులో ఖాతాలు ఉండటంతో ఈ ఖాతా నంబర్లు అందించారు. రుణానికి సంబంధిం చిన డబ్బులు బ్యాంకులో జమ కాగా.. డ్రా చేసేందు కు తండ్రి ధర్మారెడ్డి, భార్య పద్మ, తల్లి లక్ష్మితో కలిసి సెంట్రల్ బ్యాంకుకు వెళ్లాడు. ధర్మారెడ్డి పేరున రూ44,750, మాధవరెడ్డి పేర రూ80,470 మొత్తం రూ1,25, 220 డ్రా చేసి కవర్‌లో ఉంచి తండ్రికి అప్పజెప్పాడు. భార్య పద్మ ఖాతాలో కొన్ని డబ్బులు ఉం డగా.. మాధవరెడ్డి విత్ డ్రా చేస్తుండగా ధర్మారెడ్డి బల్ల పై డబ్బుల కవర్ పెట్టి ఏమరు పాటుగా ఉన్న సమయంలో గుర్తు తెలియని 14 ఏళ్ల బాలుడు కవర్‌ను తీసుకొని పారిపోయాడు.
తండ్రి వద్దకు కొడుకువచ్చి డబ్బులు ఏవనిఅడుగగా.. బిత్తర చూపులు చూస్తూ దొంగలించినట్లు గుర్తిం చిలబోదిబోమని మొత్తుకున్నారు.దీంతో తాము డ్రా చేసిన డబ్బులు అపహరిం చారని బ్యాంకు మేనేజర్ మనోజ్‌కు వివరించగా.. తాము ఏం చేసిది లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ రూరల్ సీఐ వాసాల సతీష్, ఎస్సై సత్యనారాయణ బ్యాంకు వద్దకు చేరుకొని సీసీ కెమెరాల పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.
బయట ఇద్దరు దుండగులు 14 ఏళ్ల బాలుడితో చర్చించి బ్యాంకులోకి పంపి డబ్బులు అపహరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. అపహరించిన డబ్బులతో బాలుడు బయటకు వెళ్లాక దుండగులను కలిసినట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. బ్యాంకు ముందు కొద్ది దూరంలో ఉన్న ఓ వాహనంలో పారిపోవడం సీసీ కెమెరాలో దృశ్యాలు బంధించి ఉన్నారుు. అయితే దుండగుల ముఖాలు సీసీ కెమెరాల్లో గుర్తించకపోవడం సాధ్యం కాకపోవడంతో సీసీ దృశ్యాలను పోలీసులు తమ వె ంట తీసుకెళ్లారు.
భద్రతలో నిర్లక్ష్యం
బ్యాంకు అధికారులు ఎలాంటి సెక్యూరిటీని నియమించకపోవడంతో దుండగులకు బ్యాంకు లో చోరీ సులభమైంది.చోరీలో ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లు సీసీ కెమెరాలోని దృశ్యాలను బట్టి తెలుస్తోంది. వారిని ఎలాగైనా పట్టుకుంటామని ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు.
సెంట్రల్ బ్యాంకులో చోరీ
Published Tue, Apr 21 2015 4:08 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement