నెల్లూరు(అగ్రికల్చర్) : బంగారం ధర రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో జిల్లాలోని బ్యాంకులన్నీ వరుస పెట్టి వేలం పాటలకు తెరలేపాయి. తమ వద్ద బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ధర మరింత తగ్గితే వసూళ్లు తగ్గిపోతాయని భావించడమే వాకాడుకు చెందిన మహిళా రైతు పనబాక ముత్యాలమ్మ బంగారు సరుడు, నల్లపూసల దండను బ్యాంకులో పెట్టి రూ.72వేలు రుణం తీసుకుని 2013లో పంటను సాగు చేసింది. ప్రకృతి అనుకూలించకపోవడంతో పెట్టుబడి కూడా రాలేదు.
బంగారును వేలం వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. వేలం వేస్తున్నట్లు పేపరులో ప్రకటన కూడా ఇచ్చారు. గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తుల వద్ద అధికవడ్డీకి అప్పు చేసి ఒక సంవత్సరం వడ్డీ మాత్రం కట్టగలిగింది. ఈ ఏడాది కూడా పకృతి కరుణించకపోవడంతో అప్పుల భారం పెరిగింది. బంగారుపై తీసుకున్న అప్పు, ఈ ఏడాది వడ్డీ మిగిలింది. అసలు, వడ్డీ చెల్లించాలని, లేకుంటే బంగారు వేలం వేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తుండడంతో ఆ మహిళా రైతు ఆందోళన చెందుతున్నారు.ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
జిల్లా వ్యాపితంగా 35 బ్యాంకుల పరిధిలో సుమారు 400 బ్రాంచిలు నడుస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంకులు ఉన్నాయి. అధిక వడ్డీ చెల్లించలేక రైతులు, ప్రజలు తమ అవసరాల కోసం బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణం పొందడం పరిపాటి. ఇలా రుణాలు పొందే వారిలో అత్యధిక శాతం రైతులే ఉన్నారు. సాధారణంగా రుణం తీసుకుంటే 90 పైసలు ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉండగా రైతులు 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ అవసరాలకు రైతులు బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు.
ఈ ప్రకారం అన్ని బ్యాంకుల్లో రైతులు పెద్ద మొత్తాల్లో రుణాలు పొందారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అధికార పీఠం అధిష్టించాక మాట మార్చిన బాబు చివరకు అర్హులైన రైతులకు రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. అదికూడా ఐదు విడతలగా ఐదేళ్లు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఒక విడత రుణమాఫీ డబ్బు మాత్రమే అరకొరగా ఇవ్వడంతో ఆభరణాలు చాలా వరకు బ్యాంకుల్లో ఉండిపోయాయి. పరిస్థితిని బట్టి విడిపించుకోవచ్చనే యోచనలో చాలా మంది రైతులు ఉన్నారు.
బంగారం ధర తగ్గుదలతో వేలం ప్రకటనలు
సాధారణంగా బ్యాంకుల్లో గ్రాము ప్రకారం బంగారు నగలకు రుణం ఇస్తారు. బ్యాంకర్ల నిబంధనల ప్రకారం ఆభరణాలను బట్టి 75 శాతం వరకు రుణం ఇచ్చే పరిస్థితి ఉంది. బంగారు 22 క్యారెట్లా, 24 క్యారెట్లా అనే విషయాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. గతంలో 10 గ్రాముల బంగారు ధర రూ.31 వేలు ఉండగా క్రమేణ తగ్గుతూ వస్తోంది. మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 23,420, 24 క్యారెట్ల ధర రూ.25,250గా నమోదైంది. పక్షం రోజులుగా రోజురోజుకు ధరలు తగ్గుతున్నాయి. మరికొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో బ్యాంకర్లలో కూడా ఆందోళన మొదలైంది.
గతంలో గ్రాము బంగారుకు రూ.2,100 వరకు రుణం ఇచ్చిన వారు ఇప్పుడు రూ. 1500 నుంచి రూ.1600 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఈ కారణంగా గతంలో బంగారు నగలు ఉంచి రుణం తీసుకున్నవారి బంగారం రుణం ఇంచుమించు సరిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు నష్టాలు వస్తాయని భావించిన బ్యాంకర్లు వరుసగా వేలం పాటలు నిర్వహించేందుకు ప్రకటనలు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏడాది వరకు బ్యాంకులు కాలపరిమితి విధించి బంగారంపై రుణాలు ఇస్తాయి. గడువుదాటిన తరువాత వీటిని ఎప్పుడైనా వేలం వేసే అధికారం బ్యాంకులకు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతుండడంతో బ్యాంకర్లు నోటీసులు జారీ చేసి వేలం పాటకే మొగ్గు చూపుతున్నారు. లేకుంటే తాము తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
బంగారం వేలం బాటలో బ్యాంకులు
Published Wed, Aug 5 2015 4:06 AM | Last Updated on Thu, Aug 2 2018 3:54 PM
Advertisement
Advertisement