bankers notices
-
బంగారం వేలం బాటలో బ్యాంకులు
నెల్లూరు(అగ్రికల్చర్) : బంగారం ధర రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో జిల్లాలోని బ్యాంకులన్నీ వరుస పెట్టి వేలం పాటలకు తెరలేపాయి. తమ వద్ద బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ధర మరింత తగ్గితే వసూళ్లు తగ్గిపోతాయని భావించడమే వాకాడుకు చెందిన మహిళా రైతు పనబాక ముత్యాలమ్మ బంగారు సరుడు, నల్లపూసల దండను బ్యాంకులో పెట్టి రూ.72వేలు రుణం తీసుకుని 2013లో పంటను సాగు చేసింది. ప్రకృతి అనుకూలించకపోవడంతో పెట్టుబడి కూడా రాలేదు. బంగారును వేలం వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. వేలం వేస్తున్నట్లు పేపరులో ప్రకటన కూడా ఇచ్చారు. గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తుల వద్ద అధికవడ్డీకి అప్పు చేసి ఒక సంవత్సరం వడ్డీ మాత్రం కట్టగలిగింది. ఈ ఏడాది కూడా పకృతి కరుణించకపోవడంతో అప్పుల భారం పెరిగింది. బంగారుపై తీసుకున్న అప్పు, ఈ ఏడాది వడ్డీ మిగిలింది. అసలు, వడ్డీ చెల్లించాలని, లేకుంటే బంగారు వేలం వేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తుండడంతో ఆ మహిళా రైతు ఆందోళన చెందుతున్నారు.ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా వ్యాపితంగా 35 బ్యాంకుల పరిధిలో సుమారు 400 బ్రాంచిలు నడుస్తున్నాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంకులు ఉన్నాయి. అధిక వడ్డీ చెల్లించలేక రైతులు, ప్రజలు తమ అవసరాల కోసం బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణం పొందడం పరిపాటి. ఇలా రుణాలు పొందే వారిలో అత్యధిక శాతం రైతులే ఉన్నారు. సాధారణంగా రుణం తీసుకుంటే 90 పైసలు ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉండగా రైతులు 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ అవసరాలకు రైతులు బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. ఈ ప్రకారం అన్ని బ్యాంకుల్లో రైతులు పెద్ద మొత్తాల్లో రుణాలు పొందారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అధికార పీఠం అధిష్టించాక మాట మార్చిన బాబు చివరకు అర్హులైన రైతులకు రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. అదికూడా ఐదు విడతలగా ఐదేళ్లు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఒక విడత రుణమాఫీ డబ్బు మాత్రమే అరకొరగా ఇవ్వడంతో ఆభరణాలు చాలా వరకు బ్యాంకుల్లో ఉండిపోయాయి. పరిస్థితిని బట్టి విడిపించుకోవచ్చనే యోచనలో చాలా మంది రైతులు ఉన్నారు. బంగారం ధర తగ్గుదలతో వేలం ప్రకటనలు సాధారణంగా బ్యాంకుల్లో గ్రాము ప్రకారం బంగారు నగలకు రుణం ఇస్తారు. బ్యాంకర్ల నిబంధనల ప్రకారం ఆభరణాలను బట్టి 75 శాతం వరకు రుణం ఇచ్చే పరిస్థితి ఉంది. బంగారు 22 క్యారెట్లా, 24 క్యారెట్లా అనే విషయాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. గతంలో 10 గ్రాముల బంగారు ధర రూ.31 వేలు ఉండగా క్రమేణ తగ్గుతూ వస్తోంది. మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 23,420, 24 క్యారెట్ల ధర రూ.25,250గా నమోదైంది. పక్షం రోజులుగా రోజురోజుకు ధరలు తగ్గుతున్నాయి. మరికొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో బ్యాంకర్లలో కూడా ఆందోళన మొదలైంది. గతంలో గ్రాము బంగారుకు రూ.2,100 వరకు రుణం ఇచ్చిన వారు ఇప్పుడు రూ. 1500 నుంచి రూ.1600 వరకు మాత్రమే ఇస్తున్నారు. ఈ కారణంగా గతంలో బంగారు నగలు ఉంచి రుణం తీసుకున్నవారి బంగారం రుణం ఇంచుమించు సరిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు నష్టాలు వస్తాయని భావించిన బ్యాంకర్లు వరుసగా వేలం పాటలు నిర్వహించేందుకు ప్రకటనలు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏడాది వరకు బ్యాంకులు కాలపరిమితి విధించి బంగారంపై రుణాలు ఇస్తాయి. గడువుదాటిన తరువాత వీటిని ఎప్పుడైనా వేలం వేసే అధికారం బ్యాంకులకు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతుండడంతో బ్యాంకర్లు నోటీసులు జారీ చేసి వేలం పాటకే మొగ్గు చూపుతున్నారు. లేకుంటే తాము తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
ఇలాగేనా రుణమాఫీ చేసేది?
కుప్పం: రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వారి ఆశలు నీరుగారిపోయాయి. మరో వైపు బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారు. ఇదంతా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తోంది. ప్రజలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామంటూ కుప్పంలో ప్రజాప్రతినిధులు అధికారులపై మండిపడ్డారు. సోవువారం వుండల సచివాల యుంలో రుణవూఫీపై ఎంపీటీసీ, సర్పంచ్, గ్రామ కమిటీ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జెడ్పీటీసీ రాజ్‌కువూర్ వూట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వంలో స్పష్ట త లోపించిందన్నారు. చేసే మొత్తం ఒకేసారి చేస్తే బాగుంటుందని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కడా ఎస్వో ప్రియాంకను కోరారు. ఒకేసారి రూ.50 వేలు మాఫీ చేస్తామని చెప్పినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదన్నారు. బ్యాంకర్లు వేలం నోటీసులు పంపుతున్నారని, ఇలా చేస్తే ప్రభుత్వానికి, తమకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. కంగుంది గ్రామంలో ఒక రైతుకు సంబంధించి పాత అప్పు రూ.39 ఉండగా దాన్ని విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. మాజీ ఎంపీపీ చౌడప్ప మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఉద్యాన పంటలు సాగు చేసుకోవాలని చెప్పారని, ఇప్పుడు ఆ పంటలకు రుణమాఫీ లేదని చెబుతుండడం ఆయన నైజాన్ని తెలియజేస్తోందన్నారు. బ్యాంకర్ల తప్పిదం వల్ల చాలా మందికి రుణమాఫీ వర్తించలేదని, వీటన్నింటినీ సవరించి న్యాయం చేయాలని కోరారు. -
మాటల్లోనే రుణమాఫీ..!
ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు 21న ప్రకటించిన సీఎం 22 నుంచే రుణాలు చెల్లించాలంటూ 3.5 లక్షల మందికిపైగా రైతులకు బ్యాంకర్ల నోటీసులు పంట రుణాలు మాఫీ చేశారంటూ సంబరాలు చేసుకుంటున్న టీడీపీ నేతలు నోటీసులతో ఆందోళన చెందుతున్న రైతన్నలు ఇదిగో... ఈయన పేరు యారం ప్రకాష్. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం అనుప్పల్లెకు చెందిన ఈయన మే 16, 2013న ఆంధ్రా బ్యాంకులో బంగారు అభరణాలు కుదువపెట్టి రూ.65 వేలు పంట రుణంగా తీసుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల వం తున పంట రుణం మాఫీ చేస్తున్నట్లు ఈనెల 21న చంద్రబాబు ప్రకటించడంతో తన అప్పు మాఫీ అయిందని ప్రకాష్ సంతోషించాడు. కానీ.. 22న ఆ అప్పును చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేయడంతో నిర్ఘాంతపోయాడు. ఇదేంటని బ్యాంకు అధికారులను ప్రకాష్ ప్రశ్నిస్తే.. రుణ మాఫీ చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని బ్యాంకర్లు సమాధానం చెప్పడంతో ఆందోళన చెందుతున్నాడు. ప్రకాష్ ఒక్కరికే కాదు.. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 3.5 లక్షల మంది రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేశారు. మరో ఐదు లక్షల మంది రైతులకు అప్పులు చెల్లించాలని వారం రోజుల్లోగా నోటీసులు జారీచేస్తామని బ్యాంకర్లు తెలిపారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో వ్యవసాయ రుణాలను మొత్తం మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చిన విష యం విదితమే. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రుణమాఫీకి చంద్రబాబు షరతులు పెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల లోపు పంట రుణం మాఫీ చేస్తామని ఈనెల 21న ప్రకటించారు. కానీ.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఏవీ బ్యాంకర్లకు జారీచేయలేదు. దీంతో బకాయి ల వసూళ్లకు బ్యాంకర్లు శ్రీకారం చుట్టారు. పంట రుణాల మాఫీపై చంద్రబాబు ప్రకటన చేసిన మరుసటి రోజు(ఈనెల 22) నుంచే తక్షణమే అప్పును చెల్లించాలని రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో ఇప్పటికే 3.5 లక్షల మందికిపైగా రైతులకు నోటీసులు జారీచేసినట్లు ఓ జాతీయ బ్యాంకు కీలక అధికారి ‘సాక్షి’కి తెలిపారు. మరో వారం రోజుల్లో ఐదు లక్షల మంది రైతులకు నోటీసులు జారీ చేస్తామంటున్నారు. రైతుల్లో ఆందోళన.. రాష్ట్రంలో మార్చి 31, 2014 నాటికి రూ.87,612 కోట్ల మేర పంట రుణాల రూపంలో రైతులు బ్యాంకులకు బకాయి పడినట్లు ఎస్ఎల్బీసీ (రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ) తేల్చింది. ఇందులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 7,55,270 మంది రైతులు పంట రుణాలుగా రూ.5,810.84 కోట్లు తీసుకున్నారు. రూ.3,486.50 కోట్లను బంగారు నగలు తాకట్టు పెట్టి పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా రుణంగా తీసుకున్నారు. 68,671 మంది రైతులు స్వల్పకాలిక పంట రుణాలుగా రూ.1,129.75 కోట్లు తీసుకున్నారు. వ్వవసాయ అనుబంధ శాఖల ద్వారా 45,780 మంది రైతులు రూ.753.16 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో వ్యవసాయ రుణాలు రూ.11,180.25 కోట్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది. రుణాలు మొత్తం మాఫీ అవుతాయనుకున్న రైతుల ఆశలను చంద్రబాబు ఆదిలోనే అడియాశలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల వంతున మాత్రమే పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించారు. పంట రుణాల మాఫీలో చంద్రబాబు మాట మార్చడంపై రైతులు మండిపడుతుంటే.. టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం గమనార్హం. రుణాలను మాఫీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించగానే టీడీపీ నేతలు మిఠాయిలు పంపిణీ చేశారు. కానీ.. ఇప్పుడు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తుండటంతో అప్పుడు మిఠాయిలు పంచిన టీడీపీ నేతలే ఇప్పుడు బిత్తరపోతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో ఒక్క కుప్పం మండలంలోనే రెండు వేల మందికిపైగా రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేయడం గమనార్హం. రీషెడ్యూలు లేనట్లే.. రాష్ట్రంలో 572 కరవు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మండలాల పరిధిలో రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూలు చేయాలన్న ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరించిన విషయం విదితమే. రుణాల రీషెడ్యూలుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో కరవు మండలాల్లోని రైతులకు కూడా బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 33 కరవు మండలాల్లో 1.69 లక్షల మంది రైతులు 2013-14 ఖరీఫ్‌లో రూ.1,438 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ రైతులందరికీ రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు జారీచేయడం గమనార్హం. ఇందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులు ఉండటం కొసమెరుపు. అప్పుచేసి వూనం మిగుల్చుకున్నా బ్యాంకులో బంగారు నగలు పెట్టి రుణం తీసుకున్నా. ఈ రుణం చెల్లించాలని గతంలో నోటీసులు ఇచ్చారు. రుణవూఫీ నాకూ వర్తిస్తుందని ఆశ పడ్డాను. తీరా చూస్తే నేను తీసుకున్న రుణం వ్యవసాయుం పరిధిలోకి రాదని తెలిసింది. రెండు రోజుల క్రితం తనఖాలో పెట్టిన నగలు వేలం వేస్తారని పేపర్ ద్వారా తెలిసింది. వూనం పోతుందని అప్పు చేసి నగలు విడిపించుకున్నాను. దాంతో పాటు ట వూట పంట కోసం ఉంచుకున్న డబ్బును సైతం వాడేసాను. నేను వ్యవసాయుదారుడునే కదా. నాకు రుణవూఫీ వర్తించేలా చూడాలి. -వుంజునాథ్రెడ్డి, మోట్లపల్లె, వి.కోట వుండలం దుంప తెంచింది బంగారు నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి బంగళాదుంప పంట వేసాను. రూ. 64 వేలు రుణంగా తీసుకున్నాను. అందులో రూ.60 వేలు పంటకోసం ఖర్చుపెట్టాను. తీరా పంట చేతికొచ్చే సవుయూనికి రోగాలు ఆశించారుు. పెట్టిన ఖర్చు కూడా రాలేదు. నెల క్రితం బ్యాంకు నుంచి అప్పు కట్టవుని నోటీసులు అందారుు. ఏం చేయూలో దిక్కు తోచడం లేదు. రుణవూఫీ నాకు వర్తిస్తేనే ఆర్థికంగా నిలబడగలుగుతాను. -నారాయుణప్ప, మోట్లపల్లె, వి.కోట వుండలం -
ఇదేందయ్యా బాబూ..!
కోటయ్య కమిటీనివేదిక వచ్చేదెన్నడు? రుణాల మాఫీపై బాబు నిర్ణయం తీసుకునేదెప్పుడు? అప్పులపై రైతులకు బ్యాంకర్ల నోటీసులు ఆందోళనలో జిల్లా రైతాంగం పంట రుణాల మాఫీపై నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రుణాల మాఫీపై విధి విధానాలను రూపొందించడానికి నియమించిన కోటయ్య కమిటీ గడువులోగా ప్రాథమిక నివేదిక ఇవ్వకపోగా, నివేదిక సమర్పించడానికి మరింత సమయం కోరింది. ఈ నేపథ్యంలో రుణాల మాఫీపై బాబు నిర్ణయం వెలువడేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా బ్యాంకర్లు రుణాల మంజూరుకు ముందుకు రాకపోవడంతో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది. రుణమాఫీ హామీని నమ్మి గెలిపిస్తే ఇలా చేశారేంటి బాబూ అంటూ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి షరతులు లేకుండా పంట రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆయన అధికారంలోకి రాగానే రుణాల మాఫీకి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 12న విశాఖపట్నంలో నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ 22న కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికను ఇస్తుందని.. 45 రోజుల తర్వాత తుది నివేదిక ఇస్తుందన్నారు. తుది నివేదిక అందాక రుణాల మాఫీ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రకటించినట్లుగా ఆదివారం కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికను ఇవ్వలేదు. ప్రాథమిక నివేదిక ఇవ్వడానికి మరి కొంత సమయం కావాలని కమిటీ కోరింది. ఖరీఫ్ ముంచుకొస్తోన్న నేపథ్యంలో చంద్రబాబు ఆదివారం బ్యాంకర్లకు ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.11,180.25 కోట్లు మాఫీ చేస్తారా.. జిల్లాలో 7,55,570 మంది రైతులు పంట రుణాల రూపంలో రూ.5,810.84 కోట్లు తీసుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా బంగారు నగలను తనఖా పెట్టి 4,53,162 మంది రైతులు రూ.3,486.50 కోట్లను రుణంగా తీసుకున్నారు. 68,761 మంది రైతులు స్వల్పకాలిక పంట రుణాల రూపంలో రూ.1,129.75 కోట్లను అప్పుగా పొందారు. 45,780 మంది రైతులు వ్యవసాయ పరోక్ష రుణాల రూపంలో రూ.753.16 కోట్లు అప్పుగా తీసుకున్నారు. మొత్తమ్మీద జిల్లాలో రూ.11,180.25 కోట్ల ను బ్యాంకర్లకు పంట రుణాల రూపంలో రైతులు బకాయిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు ఆ రుణాలన్నింటినీ మాఫీ చేస్తారని కర్షకులు భావిస్తున్నారు. కానీ.. కోటయ్య కమిటీ కసరత్తు, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేస్తోన్న ప్రకటనలను పరిగణనలోకి తీసుకుంటే, ఆ మేరకు రుణాల మాఫీ అయ్యే అవకాశం లేదన్నది స్పష్టమవుతోంది. ఇది రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్పష్టత లేక రైతన్నల నిర్వేదం.. రుణాల మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో బంగారు నగలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. కొన్ని చోట్ల బంగారు నగలను వేలం వేయడానికి ప్రకటనలు జారీచేస్తున్నారు. జూలై 3 లోగా రుణాలను చెల్లించకపోతే.. ఆ లోగా రీషెడ్యూలు చేసుకోవాలని రైతులకు బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఇదొక పార్శ్వమైతే.. కొత్త పంట రుణాలు పంపిణీ చేయకపోవడం మరొక పార్శ్వం. వరుస కరవుతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్న ఖరీఫ్ పంటల సాగుకు పెట్టుబడుల కోసం దిక్కులు చూస్తున్నారు. ఈ ఏడాది రూ.5,323 కోట్లను పంట రుణాలు పంపిణీ చేసేలా బ్యాంకర్లు ప్రణాళిక రూపొందించారు. కానీ.. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు పంపిణీ చేస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. రుణాల మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. జిల్లాలో ఏ ఒక్క రైతుకు ఇప్పటిదాకా కొత్తగా పంట రుణం పంపిణీ చేయకపోవడమే అందుకు తార్కాణం. మరో వైపు రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తోండటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.