మాటల్లోనే రుణమాఫీ..!
- ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు 21న ప్రకటించిన సీఎం
- 22 నుంచే రుణాలు చెల్లించాలంటూ 3.5 లక్షల మందికిపైగా రైతులకు బ్యాంకర్ల నోటీసులు
- పంట రుణాలు మాఫీ చేశారంటూ సంబరాలు చేసుకుంటున్న టీడీపీ నేతలు
- నోటీసులతో ఆందోళన చెందుతున్న రైతన్నలు
ఇదిగో... ఈయన పేరు యారం ప్రకాష్. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం అనుప్పల్లెకు చెందిన ఈయన మే 16, 2013న ఆంధ్రా బ్యాంకులో బంగారు అభరణాలు కుదువపెట్టి రూ.65 వేలు పంట రుణంగా తీసుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల వం తున పంట రుణం మాఫీ చేస్తున్నట్లు ఈనెల 21న చంద్రబాబు ప్రకటించడంతో తన అప్పు మాఫీ అయిందని ప్రకాష్ సంతోషించాడు. కానీ.. 22న ఆ అప్పును చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేయడంతో నిర్ఘాంతపోయాడు.
ఇదేంటని బ్యాంకు అధికారులను ప్రకాష్ ప్రశ్నిస్తే.. రుణ మాఫీ చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని బ్యాంకర్లు సమాధానం చెప్పడంతో ఆందోళన చెందుతున్నాడు. ప్రకాష్ ఒక్కరికే కాదు.. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 3.5 లక్షల మంది రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేశారు. మరో ఐదు లక్షల మంది రైతులకు అప్పులు చెల్లించాలని వారం రోజుల్లోగా నోటీసులు జారీచేస్తామని బ్యాంకర్లు తెలిపారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో వ్యవసాయ రుణాలను మొత్తం మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చిన విష యం విదితమే. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రుణమాఫీకి చంద్రబాబు షరతులు పెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల లోపు పంట రుణం మాఫీ చేస్తామని ఈనెల 21న ప్రకటించారు. కానీ.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఏవీ బ్యాంకర్లకు జారీచేయలేదు. దీంతో బకాయి ల వసూళ్లకు బ్యాంకర్లు శ్రీకారం చుట్టారు.
పంట రుణాల మాఫీపై చంద్రబాబు ప్రకటన చేసిన మరుసటి రోజు(ఈనెల 22) నుంచే తక్షణమే అప్పును చెల్లించాలని రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో ఇప్పటికే 3.5 లక్షల మందికిపైగా రైతులకు నోటీసులు జారీచేసినట్లు ఓ జాతీయ బ్యాంకు కీలక అధికారి ‘సాక్షి’కి తెలిపారు. మరో వారం రోజుల్లో ఐదు లక్షల మంది రైతులకు నోటీసులు జారీ చేస్తామంటున్నారు.
రైతుల్లో ఆందోళన..
రాష్ట్రంలో మార్చి 31, 2014 నాటికి రూ.87,612 కోట్ల మేర పంట రుణాల రూపంలో రైతులు బ్యాంకులకు బకాయి పడినట్లు ఎస్‌ఎల్‌బీసీ (రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ) తేల్చింది. ఇందులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 7,55,270 మంది రైతులు పంట రుణాలుగా రూ.5,810.84 కోట్లు తీసుకున్నారు. రూ.3,486.50 కోట్లను బంగారు నగలు తాకట్టు పెట్టి పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా రుణంగా తీసుకున్నారు. 68,671 మంది రైతులు స్వల్పకాలిక పంట రుణాలుగా రూ.1,129.75 కోట్లు తీసుకున్నారు.
వ్వవసాయ అనుబంధ శాఖల ద్వారా 45,780 మంది రైతులు రూ.753.16 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో వ్యవసాయ రుణాలు రూ.11,180.25 కోట్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది. రుణాలు మొత్తం మాఫీ అవుతాయనుకున్న రైతుల ఆశలను చంద్రబాబు ఆదిలోనే అడియాశలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల వంతున మాత్రమే పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించారు. పంట రుణాల మాఫీలో చంద్రబాబు మాట మార్చడంపై రైతులు మండిపడుతుంటే.. టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం గమనార్హం.
రుణాలను మాఫీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించగానే టీడీపీ నేతలు మిఠాయిలు పంపిణీ చేశారు. కానీ.. ఇప్పుడు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తుండటంతో అప్పుడు మిఠాయిలు పంచిన టీడీపీ నేతలే ఇప్పుడు బిత్తరపోతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో ఒక్క కుప్పం మండలంలోనే రెండు వేల మందికిపైగా రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీచేయడం గమనార్హం.
రీషెడ్యూలు లేనట్లే..
రాష్ట్రంలో 572 కరవు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మండలాల పరిధిలో రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూలు చేయాలన్న ప్రతిపాదనను ఆర్‌బీఐ తిరస్కరించిన విషయం విదితమే. రుణాల రీషెడ్యూలుకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో కరవు మండలాల్లోని రైతులకు కూడా బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 33 కరవు మండలాల్లో 1.69 లక్షల మంది రైతులు 2013-14 ఖరీఫ్‌లో రూ.1,438 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ రైతులందరికీ రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు జారీచేయడం గమనార్హం. ఇందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులు ఉండటం కొసమెరుపు.
అప్పుచేసి వూనం మిగుల్చుకున్నా
బ్యాంకులో బంగారు నగలు పెట్టి రుణం తీసుకున్నా. ఈ రుణం చెల్లించాలని గతంలో నోటీసులు ఇచ్చారు. రుణవూఫీ నాకూ వర్తిస్తుందని ఆశ పడ్డాను. తీరా చూస్తే నేను తీసుకున్న రుణం వ్యవసాయుం పరిధిలోకి రాదని తెలిసింది. రెండు రోజుల క్రితం తనఖాలో పెట్టిన నగలు వేలం వేస్తారని పేపర్ ద్వారా తెలిసింది. వూనం పోతుందని అప్పు చేసి నగలు విడిపించుకున్నాను. దాంతో పాటు ట వూట పంట కోసం ఉంచుకున్న డబ్బును సైతం వాడేసాను. నేను వ్యవసాయుదారుడునే కదా. నాకు రుణవూఫీ వర్తించేలా చూడాలి.
-వుంజునాథ్‌రెడ్డి, మోట్లపల్లె, వి.కోట వుండలం
దుంప తెంచింది
బంగారు నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి బంగళాదుంప పంట వేసాను. రూ. 64 వేలు రుణంగా తీసుకున్నాను. అందులో రూ.60 వేలు పంటకోసం ఖర్చుపెట్టాను. తీరా పంట చేతికొచ్చే సవుయూనికి రోగాలు ఆశించారుు. పెట్టిన ఖర్చు కూడా రాలేదు. నెల క్రితం బ్యాంకు నుంచి అప్పు కట్టవుని నోటీసులు అందారుు. ఏం చేయూలో దిక్కు తోచడం లేదు. రుణవూఫీ నాకు వర్తిస్తేనే ఆర్థికంగా నిలబడగలుగుతాను.
-నారాయుణప్ప, మోట్లపల్లె, వి.కోట వుండలం