- విచారణకు గైర్హాజరైన కోటేశ్వరరావు
- కిందికోర్టు తీర్పును సమర్థించిన నాంపల్లి కోర్టు
సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామ కోటేశ్వరరావుకు నాంపల్లి ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసిన కేసులో ప్రత్యేక కోర్టు విధిం చిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు మంగళవారం కొట్టివేసింది. విచారణ సంద ర్భంగా కోటేశ్వరరావు కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయ నపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతోపాటు కింది కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని నిర్ధారించింది.
విశ్వేశ్వర ఇన్‌ఫ్రా డైరెక్టర్‌గా ఉన్న కోటేశ్వరరావు పీఎన్‌బీ నుంచి తీసుకున్న రుణం చెల్లించకపోవడంతోపాటు చెల్లని చెక్కులు ఇచ్చారు. దీంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారిం చిన ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు 2015లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించినా చుక్కెదురైంది. అయితే ఈ కేసులో కొత్తపల్లి గీతను కూడా నిందితురాలిగా చేర్చాలంటూ పీఎన్‌బీ చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.