అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పి.రామకోటేశ్వరరావుపై నాంపల్లి కోర్టు బుధవారం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పి.రామకోటేశ్వరరావుపై నాంపల్లి కోర్టు బుధవారం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కింది కోర్టు తీర్పును అప్పీల్ చేసుకున్న ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. రామకోటేశ్వరరావు విశ్వేశ్వర ఇన్‌ఫ్రా సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. దీని కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారు.
దాన్ని తిరిగి చెల్లించే నిమిత్తం ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో బ్యాంకు అధికారులు ఎర్రమంజిల్‌లోని న్యాయస్థానాన్ని ఆశ్ర రుుంచారు. ఈ అంశాన్ని నిర్ధారించిన న్యాయస్థానం రామకోటేశ్వర రావుకు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రామకోటేశ్వరరావు నాంపల్లిలోని 8వ ఏఎంఎస్‌జే కోర్టులో పిటిషన్ వేశారు. దీని విచారణకు గైర్హాజరు అవుతుండటంతో కోర్టు బుధవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.