న్యూఢిల్లీ: అవినీతి ఫిర్యాదులు 50 శాతానికి పైగా తగ్గాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) పేర్కొంది. ‘2015లో 29,838 ఫిర్యాదులు సీవీసీకి అందాయి. ఐదేళ్లలో ఇదే అత్యంత కనిష్టం. 2014లో వచ్చిన 62,362 ఫిర్యాదుల కన్నా 52 శాతం తక్కువ’ అని ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన సీవీసీ వార్షిక నివేదిక చెప్తోంది. అలాగే.. అవినీతి ఆరోపణలతో 2013లో 31,432 ఫిర్యాదులు, 2012లో 37,039 ఫిర్యాదులు, 2011లో 16,929 ఫిర్యాదులు అందాయని తెలిపింది.
2014లో కొందరు ఫిర్యాదుదారులు అనేక ఫిర్యాదులు చేయటం వల్ల సంఖ్య ఎక్కువగా ఉందని.. దానివల్ల ఆ ఏడాదితో పోలిస్తే 2015లో వచ్చిన ఫిర్యాదుల సంఖ్య తగ్గిపోయినట్లు కనిపిస్తోందని వివరించింది. గత ఏడాది వచ్చిన ఫిర్యాదుల్లో 12,650 ఫిర్యాదులు అస్పష్టంగా, తనిఖీ చేయలేని విధమైనవని చెప్పింది.
అవినీతి ఫిర్యాదులు సగానికి పైగా తగ్గాయి: సీవీసీ
Published Fri, Aug 5 2016 1:00 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement