న్యూఢిల్లీ : ప్రభుత్వాధికారులకు వ్యతిరేకంగా భారీగా అవినీతి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వారికి వ్యతిరేకంగా దాదాపు 26వేలకు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు ప్రభుత్వం నేడు లోక్‌సభకు వెల్లడించింది. ఫిర్యాదులు నమోదైన వారిలో సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సమాచారం మేరకు ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా 2017లో 26,052 ఫిర్యాదులు అందాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ నేడు లోక్‌సభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు.
వీటిలో 22,386 ఫిర్యాదులు తిరస్కరించినట్టు పేర్కొన్నారు. కాగ, 2016లో 51,207 ఫిర్యాదులు, 2015లో 32,149 ఫిర్యాదులు అందినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. వీటిలో 2016లోని 48,764 ఫిర్యాదులను, 2015లోని 30,789 ఫిర్యాదులను తిరస్కరించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment