న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారుల అవినీతిని గుర్తించడానికి ఆధార్‌ను వినియోగించుకోవాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) యోచిస్తోంది. పాన్, ఆధార్ సమాచారంతో వ్యక్తులు జరిపే ఆర్థిక లావాదేవీలు సక్రమమో కాదో తేల్చడం సులభమవుతుందని భావిస్తోంది. పలు ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల క్రయవిక్రయాలకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలోనే సీవీసీ ఈ దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్ సాయంతో ఇతర ప్రభుత్వ విభాగాలతో కలసి ప్రభుత్వ అధికారుల అవినీతిని గుర్తించి, విచారించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్, విధివిధానాలను రూపొందిస్తున్నామని సీవీసీ కేవీ చౌదరి తెలిపారు. పౌరుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఐటీ, రిజిస్ట్రేషన్ విభాగాలు, ఆర్థిక నిఘా సంస్థల వద్ద ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment