న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలనకు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) అన్ని ప్రభుత్వ విభాగాల్ని కోరింది. అవినీతికి వ్యతిరేకంగా సీవీసీ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్లు(సీవీవో) అందరూ తమ విధానాలతో పాటు వ్యూహాల్ని కమిషన్‌తో పంచుకోనున్నారు.
గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 15 లక్షల మంది ప్రజలతో పాటు 30,000 సంస్థలు అవినీతి నిర్మూలనకు ఈ–ప్రతిజ్ఞ చేశాయని సీవీసీ పేర్కొంది. సెమినార్లు నిర్వహించడంతో పాటు బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రభుత్వాధికారులు, ప్రజల్లో అవినీతిపై అవగాహన కలిగిస్తామని కమిషన్ తెలిపింది.
సరికొత్త ఆలోచనలతోనే అవినీతికి చెక్
Published Wed, Jun 14 2017 8:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
Advertisement