అవినీతి అధికారులపై చర్యలకు ఆలస్యం: సీవీసీ
న్యూఢిల్లీ: అవినీతి బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు జాప్యం చేస్తున్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నివేదిక పేర్కొంది. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడం, బ్యాంక్ మోసాల కేసులు అధికమవుతున్న పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు వంద మంది అవినీతి బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాయని సీవీసీ నివేదిక తప్పుపట్టింది.
సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్ హోదాల్లో ఉన్న దాదాపు 98 మంది బ్యాంక్ అధికారులను విచారించడానికి అనుమతించాలంటూ వివిధ బ్యాంకులను గత నాలుగు నెలల నుంచి అనుమతులు కోరుతున్నామని పేర్కొంది. కానీ బ్యాంకుల నుంచి తగిన స్పందన లేదని వివరించింది. మొత్తం 43 కేసుల్లో ఎక్కువ కేసులు (7) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు చెందినవని వివరించింది.
బ్యాంక్‌లు జాప్యం చేస్తున్నాయ్...
Published Mon, Apr 11 2016 12:32 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement