కౌంట్ డౌన్: బ్లాక్ మనీ హోల్డర్స్కు వార్నింగ్స్
కౌంట్ డౌన్: బ్లాక్ మనీ హోల్డర్స్కు వార్నింగ్స్
Published Fri, Mar 24 2017 1:51 PM | Last Updated on Wed, Apr 3 2019 5:14 PM
న్యూఢిల్లీ : బ్లాక్మనీ హోల్డర్స్కు ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీచేసింది. బ్లాక్మనీ హోల్డర్స్ కోసం అందుబాటులో ఉంచిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) గడువు ముగుస్తుందని.. ఇదే ఆఖరి అవకాశమని హెచ్చరించింది. మార్చి 31 ముగియనున్న డెడ్ లైన్కు కౌంట్ డౌన్ ప్రారంభించినట్టు అన్ని రకాల న్యూస్ డైలీస్లో ప్రకటించింది. ఈ గడువు ముగిసే లోపలే బ్లాక్ మనీ వివరాలు వెల్లడించాలని, లేని పక్షంలో బినామీ చట్టాల కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
డిఫాల్డర్ల పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లాంటి కేంద్ర విచారణ సంస్థలకు షేర్ చేస్తామని, పన్ను, జరిమానాలు భారీగా ఉంటాయని వెల్లడించింది. పీఎంజీకేవైను సద్వినియోగం చేసుకోలేని వారి నగదు డిపాజిట్లకు 137 శాతం కంటే ఎక్కువ పన్ను, జరిమానాలే ఉండనున్నాయని సీనియర్ అధికారి చెప్పారు. డిపాల్టర్లకు వ్యతిరేకంగా బినామి చట్టాలను ప్రయోగించడంలో అసలు వెనక్కు తగ్గబోమని హెచ్చరించారు. పీఎంజీకేవైను సద్వినియోగం చేసుకునే బ్లాక్ మనీ హోల్డర్స్ వివరాలను బయటపెట్టమని, కానీ వారి ఆదాయంపైన 49.9 శాతం పన్ను ఉంటుందన్నారు. ఈ స్కీమ్ ను వాడుకోకుండా... ఆదాయపు పన్ను రిటర్న్స్ లో నల్లధన వివరాలు తెలిపితే వారికి పన్ను, పెనాల్టి కింద 77.25 శాతం విధించనున్నారు.
ఒకవేళ, తనిఖీల సమయంలో లెక్కల్లో చూపని ఆదాయం ఉన్నట్లు అంగీకరించడంతో పాటు దానికి సంబంధించి సరైన వివరణ ఇచ్చిన పక్షంలో 107.25 శాతం దాకా పన్నులు, జరిమానా ఉండగలవని ఆదాయ పన్ను విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తనిఖీల్లో దొరికిన నల్లధనాన్ని సరెండర్ చేయని వారికి ఏకంగా 137.25 శాతం పన్ను విధించేస్తామని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్ మనీ హోల్డర్స్ కోసం ప్రభుత్వం ఈ పీఎంజీకేవై పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తుది అవకాశంగా ప్రభుత్వం హెచ్చరించింది.
Advertisement
Advertisement