
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో వేడి రాజుకుంటోంది.
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో వేడి రాజుకుంటోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ‘‘కలలతో వ్యాపారం చేయాలనుకునే వాళ్లను గుజరాత్ ప్రజలు ఆదరించరు. వారి కలలు ఎన్నటికీ నెరవేరవు’’ అంటూ అమిత్‌షా ధ్వజమెత్తారు. దీనికి..
‘‘నిజమే. నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున పంచుతామంటూ పంచ రంగుల కలలు చూపిన వారిని ప్రజలు ఎప్పటికీ నమ్మరు’’ అంటూ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం గాంధీనగర్‌లో మంగళవారం కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
గుజరాత్‌లో పర్యటిస్తున్న కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఓడిపోతోందని, కాంగ్రెస్ పనైపోయిదని జోస్యం చెప్పారు. తామొస్తే అవినీతి రహిత పరిపాలన అందిస్తామన్నారు.
ఇదీ చదవండి: అమిత్ షా మఫ్లర్ ఖరీదు రూ.80వేలు!