
సాక్షి, హైదరాబాద్: నల్లధనం నిర్మూలించేందుకు ప్రధాని మోదీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వ ర్యంలో న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్‌కాసాథ్, సబ్‌కా వికాస్ నినాదంతో దేశప్రజల సమగ్రాభివృద్ధికి మోదీ విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారన్నారు.