
కెమెరామెన్‌గా...
జోషి దర్శకత్వంలో మోహన్‌లాల్ కెమెరామెన్‌గా, అమలాపాల్ జర్నలిస్ట్‌గా నటించిన మలయాళ హిట్ ‘రన్ బేబి రన్’ను మాజిన్ మూవీమేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్
జోషి దర్శకత్వంలో మోహన్‌లాల్ కెమెరామెన్‌గా, అమలాపాల్ జర్నలిస్ట్‌గా నటించిన మలయాళ హిట్ ‘రన్ బేబి రన్’ను మాజిన్ మూవీమేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ ‘బ్లాక్‌మనీ’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్నీ కొత్త నోట్లే... అనేది ఉపశీర్షిక.
రతీష్ వేగ స్వరపరచిన ఈ సినిమా పాటలను హీరోయిన్ సోనీ చరిస్టా విడుదల చేశారు. ‘‘మీడియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వృత్తి నిర్వహణలో తమకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారనేది కథ. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది’’ అన్నారు సయ్యద్ నిజాముద్దీన్. రచయిత వెన్నెలకంటి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: నిజామ్.