ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత కనుమరుగైపోయిందని, రాజకీయాల్లో ఒక మాట అంటూ ఇస్తే.. ఆ మాటకు కట్టుబడి ఉండే పరిస్థితి కనిపించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నాలుగేళ్ల చంద్రబాబు పాలన నిదర్శనంగా నిలిచిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు. ప్రజలకు ఫలానాది చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో టీడీపీ సర్కారు ఉందని ఆయన విమర్శించారు. ‘ప్రజాసంకల్పయాత్ర’ చేపడుతున్న వైఎస్ జగన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. బుధవారం మూడోరోజు పాదయాత్ర సందర్భంగా వీఎన్‌పల్లిలో ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు.