
బ్లాక్‌మనీ వెలికితీతపై ఐటీ శాఖ విఫలం: కాగ్
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన పలు సంస్థలు పన్నులు ఎగ్గొట్టాయనేందుకు రుజువులు చిక్కినా ఆదాయ పన్ను శాఖ తగిన చర్యలు తీసుకోలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వ్యాఖ్యానించింది. నల్లధనాన్ని వెలికితీయడంలో విఫలమైందని పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. మహారాష్ట్రకు చెందిన 2,059 మంది డీలర్లు వ్యాట్ సహా సుమారు రూ. 10,640 కోట్ల పన్ను ఎగవేసేలా బోగస్ ఇన్‌వాయిస్‌లు జారీ చేశాయని కాగ్ పేర్కొంది.