
న్యూఢిల్లీ: కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐకి మార్గదర్శనం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. పార్టీ సీనియర్ నాయకులతో ఓ మండలిని ఏర్పాటుచేశారు. రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, మానిక్ టాగోర్‌లు అ మండలిలో ఉన్నారు. ‘ఐవైసీ, ఎన్‌ఎస్‌యూఐ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఈ మార్గదర్శక మండలి భర్తీచేస్తుంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ పేర్కొన్నారు.
ఎన్‌ఎస్‌యూఐ చీఫ్, ఎన్‌ఎస్‌యూఐ ఏఐసీసీ ఇన్‌చార్జిలు ఈ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. మండలితోపాటుగా 37 మంది కార్యదర్శులతో యూత్ కాంగ్రెస్‌ను కూడా రాహుల్ విస్తరించారు. అమరీష్ రంజన్ పాండేను యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment