
కేటీఆర్‌కు, కవితకు ఎండ దెబ్బ తగిలింది
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. యువతను మోసం చేస్తోందని విమర్శించారు. గాంధీ భవన్‌లో ఆదివారం జరిగిన ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మనవడికి కూడా ఒక ఉద్యోగం దొరికిందని, కేసీఆర్‌కు ప్రభుత్వపరంగా జరిగే కార్యక్రమంలో పాల్గొనే తీరిక లేకుండాపోయిందని దుయ్యబట్టారు.
కేటీఆర్‌కు, కవితకు ఎండ దెబ్బ తగిలి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను అడిగితే కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తారని కేటీఆర్, కవితలకు ఆయన హితవు పలికారు. కేటీఆర్ దిగే సెల్ఫీ టెక్నాలజీ ఎక్కడ నుండి వచ్చిందో తెలియదా అని ప్రశ్నించారు. తాను ఎంపీనన్న విషయాన్నికవిత మర్చిపోయిందని, రాష్ట్రంలో మినిస్టర్ ,సీఎం కావాలనుకుంటోందని చురకలంటించారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అనిల్‌కుమార్ అన్నారు.