సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం ఈనెల 17వ తేదీ సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని నిర్ణయించారు. అయితే మోదీ పాలనతో యువతకు ఒరిగిందేమీ లేదనే ఉద్దేశంతో ఆయన జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధం యువజన కాంగ్రెస్ ప్రకటించింది. మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ తరహాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది.
చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు
ఏడున్నరేళ్ల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చేముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఉద్యోగాలు లేక యువత రోడ్ల మీద తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే దేశంలో నిరుద్యోగిత 2.4 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగిందని తెలిపారు.
చదవండి: ‘రాజు’ కోసం వేట.. తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
Let's Celebrate the birthday of PM Modi as #NationalUnemploymentDay.
— Srinivas BV (@srinivasiyc) September 15, 2021
The Man who pushed India towards record-breaking unemployment & made the whole of India Unemployed. #HallaBol pic.twitter.com/cmZYLairF2
Comments
Please login to add a commentAdd a comment