Unemployment protest
-
నిరుద్యోగిపై డిప్యూటీ కలెక్టర్ దాష్టీకం.. లాఠీతో చితకబాది, ఈడ్చుకెళ్లి..!
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో నిరుద్యోగులు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వారని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావాహులపై జల ఫిరంగాలు ప్రయోగించారు. జాతీయ జెండాను పట్టుకున్న ఓ యువకుడిని డిప్యూటీ కలెక్టర్ లాఠీతో కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు.. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ, అగ్నిపత్ పథకాలను నిరసిస్తూ జన్ అధికార్ పార్టీ లోక్తాంత్రిక్ ఆందోళనకు దిగినట్లు పలువురు పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలు చేపట్టినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నిరసనల సందర్బంగా పాట్నా డిప్యూటీ కలెక్టర్ ఓ యువకుడిని తీవ్రంగా కొట్టటం, రోడ్డుపై ఈడ్చుకెళ్లటంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. పాట్నా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కేకే సింగ్.. నిరసనకారులను కిందపడేసి కొట్టారు. జాతీయ జెండా పట్టుకున్న యువకుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. 20 लाख नौकरियाँ देने की बात करने वाले नीतीश कुमार की पुलिस ने पटना में प्रदर्शन कर रहे शिक्षक अभ्यर्थी को अमानवीय तरीके से मारा। बिहार की सरकार और उसके अधिकारी ने न सिर्फ शिक्षक के चेहरा को लहूलुहान कर दिया बल्कि तिरंगे का भी अपमान किया। यही है जेडीयू-राजद सरकार का असली चेहरा… pic.twitter.com/7r75xHoOYU — Amit Malviya (@amitmalviya) August 22, 2022 మరోవైపు.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ కొత్త ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించనుందని ప్రకటించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఈ క్రమంలో నిరుద్యోగులు నిరసనలు దిగటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్ అధికార కూటమిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇచ్చిన హామీని నెరవేర్చలేకే నిరుద్యోగులపై లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు బీజేపీ నేత షేహజాద్ పూనావాలా. తన హామీపై ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. #WATCH | Bihar: Jan Adhikar Party Loktantrik holds a protest march against inflation, GST and Agnipath scheme, in Patna. Police used water cannons to disperse the crowd. pic.twitter.com/vJQsrxAqbp — ANI (@ANI) August 22, 2022 ఇదీ చదవండి: బీహార్ సీఎం నితీష్‌కు బిగ్ షాక్.. దాడి చేసిన 13 మంది అరెస్ట్.. వీడియో వైరల్ -
జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం ఈనెల 17వ తేదీ సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని నిర్ణయించారు. అయితే మోదీ పాలనతో యువతకు ఒరిగిందేమీ లేదనే ఉద్దేశంతో ఆయన జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధం యువజన కాంగ్రెస్ ప్రకటించింది. మోదీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ తరహాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు ఏడున్నరేళ్ల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చేముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఉద్యోగాలు లేక యువత రోడ్ల మీద తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే దేశంలో నిరుద్యోగిత 2.4 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగిందని తెలిపారు. చదవండి: ‘రాజు’ కోసం వేట.. తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్ Let's Celebrate the birthday of PM Modi as #NationalUnemploymentDay. The Man who pushed India towards record-breaking unemployment & made the whole of India Unemployed. #HallaBol pic.twitter.com/cmZYLairF2 — Srinivas BV (@srinivasiyc) September 15, 2021 -
నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే..
సిరిసిల్ల: రాష్ట్రంలోని 54 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదాకా దీనిని కొనసాగించాలన్నారు. ఎన్నికల సమయంలో రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లెలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి కనీసం వారికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. ఆయనకు మానవత్వం లేదని, అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. గొల్లపల్లెలో ఆత్మహత్యకు పాల్పడిన ముచ్చర్మ మహేందర్ యాదవ్ కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ఖాళీలతో కలిపి మొత్తం 3.85 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఏడేళ్లలో నిరుద్యోగం నాలుగు రెట్లు అయ్యిందన్నారు. రుణమాఫీ అంటే వైఎస్సార్‌దే రైతులకు రుణమాఫీ అంటే దివంగత నేత వైఎస్సార్ చేసిందేనని షర్మిల చెప్పారు. ఆయన ఒకే సారి రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. దీనితో పాటు ఆరోగ్యశ్రీ, 108 వంటి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. ఇప్పుడు రైతులు రుణమాఫీలు లేక వడ్డీలు కడుతున్నారని తెలిపారు. 2 లక్షల పెన్షన్లను రద్దు చేశారని, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ముష్టి రూ.35 వేలు ఇస్తున్నారని విమర్శించారు. అంతకు ముందు మహేందర్ యాదవ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. -
‘ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కొలువులేవి?’
సిరిసిల్ల: ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. మళ్లీ కొలువుల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల శివారులోని గొల్లపల్లెలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగం రాలేదన్న మానసిక వేదనతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన గొల్లపల్లెకు చెందిన ముచ్చర్ల మహేందర్ యాదవ్ (29) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం 15 లక్షలమంది చూస్తున్నారు. ఉద్యోగాల కోసం 54 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉద్యోగాలు ఏవీ.. నిరుద్యోగ భృతి ఏదీ. ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. మళ్లీ ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అన్నారు. -
పోస్టులు పెంచకుంటే ఆత్మహత్యలు
గుంటూరు ఈస్ట్/ కాకినాడ సిటీ: ప్రభుత్వం పీఈటీ పోస్టులు పెంచాలని, లేకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. గుంటూరు, కాకినాడల్లో వాటర్ ట్యాంకుల పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. గుంటూరులో వీరి నిరసనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆందోళనకు దిగినవారిని మహిళా అభ్యర్థులని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేశారు. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పీఈటీ అభ్యర్థులు గుంటూరు చేరుకున్నారు. 1,056 పీఈటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆనందపేటలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. అభ్యర్థుల్లో కొందరు ట్యాంక్ పైకి ఎక్కి తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ నినదించారు. మిగిలిన వారు పోలీసులు పైకి వెళ్లకుండా మెట్ల వద్ద అడ్డుగా నిలబడి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నిరసన ఉధృతరూపం దాల్చడంతో ఆర్డీఓ వీరబ్రహ్మం, ఆర్జేడీ శ్రీనివాసరెడ్డి, డీఈఓ గంగాభవాని, డీఎస్పీ కండే శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే నిరసన విరమిస్తామని, లేదంటే ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందంటూ మండిపడ్డారు.రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యక్షుడు పి.రమేష్, ఇతర నాయకులు హరికృష్ణ, లక్ష్మణ్, అజరత్‌రెడ్డి మాట్లాతూ.. ప్రభుత్వం 1,056 పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన వేలాదిమంది అభ్యర్థులు అంతవరకు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు మానివేశారన్నారు. ఒక్కొక్కరు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకున్నారని, టెట్ పరీక్ష అర్హత పొందిన మహిళా అభ్యర్థులు శారీరకç దారుఢ్య పరీక్షల కోసం గర్భస్రావాలు సైతం చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ప్రభుత్వం 47 పోస్టులనే ప్రకటించడంతో విజయనగరం, కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారు గుర్తు చేశారు. పోలీసుల దౌర్జన్యం సాయంత్రం 4గంటల సమయంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి.రామన్న నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు పీఈటీ అభ్యర్థులను వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ట్యాంక్ మెట్ల వద్ద నిరసన తెలుపుతున్న మహిళా అభ్యర్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో వారు పెద్దపెట్టున రోదించారు. ట్యాంక్‌పై ఉన్న మహిళా అభ్యర్థులు తాము కిందకు దిగబోమని, ఆత్మహత్య చేసుకుంటామంటూ పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకుని దూకేందుకు ప్రయత్నించడంతో వారి మధ్య తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ, మరికొందరు అభ్యర్థులు స్వల్పంగా గాయపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. విద్యా శాఖ మంత్రి ప్రకటించిన విధంగా 1,056 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇలావుండగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కూడా సుమారు 100 మంది పీఈటీలు ఆందోళనకు దిగారు. కుళాయి చెరువు ఆవరణలోని ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కి తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన కొనసాగించారు. అర్బన్ తహసీల్దార్ వరాలయ్య, పోలీసు ఉన్నతాధికారులు వారితో చర్చించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు. -
మద్దతా... తటస్థమా!
నిరుద్యోగ నిరసనపై టీపీసీసీ తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీపై ఎలాంటి వైఖరిని ప్రకటించాలనే దానిపై టీపీసీసీలో తర్జనభర్జన జరుగుతోంది. మా ఉద్యోగాలు మాకు కావాలనే నినాదంతో ఈ నెల 22న హైదరాబాద్‌లో నిరుద్యోగ నిరసన ర్యాలీని నిర్వహించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి ఇప్పటికే పలు విద్యా ర్థి, యువజన, ప్రజా, సామాజిక, తెలంగాణ ఉద్యమ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన టీఆర్ఎస్ రెండున్నరేళ్లు దాటినా అన్ని స్థాయిల్లోని అన్ని శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 6–7 వేల మధ్యనే ఉందని టీపీసీసీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉద్యమ కాలంలో ఎన్నో ఇబ్బందు లకోర్చిన విద్యార్థు లు, నిరుద్యోగులు ఈ రెండున్నరేళ్ల టీఆర్ ఎస్ పాలనలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నార ని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు... ‘ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంలేదని, ఉపాధి అవకాశాలను తెలంగాణ రాష్ట్రంలో నూ పొందలేకపోతున్నామని నిరుద్యోగులు ఆగ్రహావేశాల్లో ఉన్నారు. జేఏసీ మంచి సమ స్యను వెలుగులోకి తెస్తున్నది. నిరుద్యోగ నిరసన ర్యాలీ మంచి కార్యక్రమమే. అయితే మద్దతు ఇవ్వాలా... వద్దా అనేదానిపైనే ఒక రాజకీయ పార్టీగా కొన్ని సమస్యలు, భిన్నాభి ప్రాయాలున్నాయి’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. ‘ఇప్పుడు జేఏసీగా చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష పార్టీ గా మద్దతు ఇవ్వడం, కలసి పోరాడటంలో అభ్యంతరమేమీ లేదు. అయితే భవిష్యత్తులో జేఏసీ ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే ఉత్పన్నం కాబోయే పరిణామాలపై నే మీమాంస’ అని టీపీసీసీలో మరో కీలక నేత చెప్పారు. బహిరంగంగా మద్దతు ప్రక టించకుండా, ఎక్కడికక్కడ ఈ ర్యాలీ విజయ వంతం అయ్యేలా సహకరిస్తే సరిపోతుందని కొందరు భావిస్తున్నారు. తటస్థంగా ఉంటే మేలని ఎక్కువమంది నేతలు అభిప్రాయప డుతున్నట్టు తెలుస్తోంది.