నిరుద్యోగ నిరసనపై టీపీసీసీ తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీపై ఎలాంటి వైఖరిని ప్రకటించాలనే దానిపై టీపీసీసీలో తర్జనభర్జన జరుగుతోంది. మా ఉద్యోగాలు మాకు కావాలనే నినాదంతో ఈ నెల 22న హైదరాబాద్‌లో నిరుద్యోగ నిరసన ర్యాలీని నిర్వహించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి ఇప్పటికే పలు విద్యా ర్థి, యువజన, ప్రజా, సామాజిక, తెలంగాణ ఉద్యమ సంఘాలు మద్దతు ప్రకటించాయి.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన టీఆర్‌ఎస్ రెండున్నరేళ్లు దాటినా అన్ని స్థాయిల్లోని అన్ని శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 6–7 వేల మధ్యనే ఉందని టీపీసీసీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉద్యమ కాలంలో ఎన్నో ఇబ్బందు లకోర్చిన విద్యార్థు లు, నిరుద్యోగులు ఈ రెండున్నరేళ్ల టీఆర్ ఎస్ పాలనలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నార ని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.
పార్టీలో భిన్నాభిప్రాయాలు...
‘ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంలేదని, ఉపాధి అవకాశాలను తెలంగాణ రాష్ట్రంలో నూ పొందలేకపోతున్నామని నిరుద్యోగులు ఆగ్రహావేశాల్లో ఉన్నారు. జేఏసీ మంచి సమ స్యను వెలుగులోకి తెస్తున్నది. నిరుద్యోగ నిరసన ర్యాలీ మంచి కార్యక్రమమే. అయితే మద్దతు ఇవ్వాలా... వద్దా అనేదానిపైనే ఒక రాజకీయ పార్టీగా కొన్ని సమస్యలు, భిన్నాభి ప్రాయాలున్నాయి’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. ‘ఇప్పుడు జేఏసీగా చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష పార్టీ గా మద్దతు ఇవ్వడం, కలసి పోరాడటంలో అభ్యంతరమేమీ లేదు.
అయితే భవిష్యత్తులో జేఏసీ ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే ఉత్పన్నం కాబోయే పరిణామాలపై నే మీమాంస’ అని టీపీసీసీలో మరో కీలక నేత చెప్పారు. బహిరంగంగా మద్దతు ప్రక టించకుండా, ఎక్కడికక్కడ ఈ ర్యాలీ విజయ వంతం అయ్యేలా సహకరిస్తే సరిపోతుందని కొందరు భావిస్తున్నారు. తటస్థంగా ఉంటే మేలని ఎక్కువమంది నేతలు అభిప్రాయప డుతున్నట్టు తెలుస్తోంది.