YSR Telangana Party YS Sharmila Holds Hunger Strike Against Unemployment In Telangana - Sakshi
Sakshi News home page

‘ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కొలువులేవి?’

Published Tue, Aug 3 2021 1:41 AM | Last Updated on Tue, Aug 3 2021 5:44 PM

YSR Telangana Party YS Sharmila Unemployment Hunger Strike - Sakshi

సిరిసిల్ల: ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. మళ్లీ కొలువుల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల శివారులోని గొల్లపల్లెలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగం రాలేదన్న మానసిక వేదనతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన గొల్లపల్లెకు చెందిన ముచ్చర్ల మహేందర్‌ యాదవ్‌ (29) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం దీక్షను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ కోసం 15 లక్షలమంది చూస్తున్నారు. ఉద్యోగాల కోసం 54 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉద్యోగాలు ఏవీ.. నిరుద్యోగ భృతి ఏదీ. ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. మళ్లీ ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement