
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్‌ను దగ్ధం చేసిన ఘటనలో పంజాబ్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బృందర్ ధిల్లాన్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ దగ్థం కేసులో దర్యాపు కొనసాగుతోందని, ఈ ఘటనలో పాల్గొన్న ఇతరులను గుర్తిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేసి వీరిపై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు నాన్‌బెయిలబుల్ సెక్షన్‌లతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఇండియా గేట్ వద్ద ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఆందోళనలో భాగంగా వారు ట్రాక్టర్‌కు నిప్పంటించడం కలకలం రేపింది. చదవండి : భగ్గుమన్న దేశ రాజధాని.. ఉద్రిక్తం
Comments
Please login to add a commentAdd a comment