ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గొట్టిముక్కుల రమాకాంత్‌రెడ్డి తెలి పారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హన్మకొండ రాయపురలోని జక్రియా ఫంక్షన్ హాల్‌లో విజయోత్సవ సభ జరుగుతుం దని, అంతకుముందుగా ఉదయం 10 గంటలకు కాజీపేట నుంచి హన్మకొండ చౌరస్తా వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆ తర్వాత చౌరస్తా నుంచి ఫంక్షన్ హాల్ వరకు పాదయాత్రగా వెళ్తామని తెలిపారు. సభలో కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యతో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చల్ల వంశీధర్‌రెడ్డి పాల్గొంటారని, నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రమాకాంత్‌రెడ్డి కోరారు. సమావేశంలోయూత్ కాంగ్రెస్ నాయకులు జన్ను నవీన్, చీకటి కీర్తికుమార్, జన్ను సతీష్, రాజారపు శ్రీనాథ్ తది తరులు పాల్గొన్నారు.
నేడు తెలంగాణ విజయోత్సవ సభ
Published Sat, Sep 14 2013 3:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM