‘సూటు బూటు సర్కారుకు శుభాకాంక్షలు’
కోజికోడ్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ‘ఏదో కారణం వల్ల’ భూసేకరణ బిల్లును హడావుడిగా ఆమోదించాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రభుత్వం ఈ తరహాలో తన విధానాలను కొనసాగించేట్లయితే.. అది పూర్తికాలం కొనసాగబోదని, ఐదో జన్మదినాన్ని జరుపుకోబోదని హెచ్చరించారు. మంగళవారమిక్కడ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. ‘ప్రభుత్వ పాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సూటు బూటు సర్కారుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా’ అని ఎద్దేవా చేశారు. వేడుకలు ప్రభుత్వానికి గల కొద్దిమంది శక్తివంతులైన స్నేహితులకేనన్నారు.