Notice To Rahul Gandhi Over Unparliamentary Remarks Against PM Modi In Lok Sabha - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై వ్యాఖ్యలు.. రాహుల్‌ గాంధీకి నోటీసులు

Published Mon, Feb 13 2023 5:54 AM | Last Updated on Mon, Feb 13 2023 8:41 AM

Notice to Rahul Gandhi over unparliamentary remarks  - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి లోక్‌సభ సెక్రెటేరియట్‌ నోటీసులిచ్చింది. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాసింది.

రాష్ట్రపతి ప్రసంగానికి ధర్మాసనం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీపై రాహుల్‌ చేసిన విమర్శల పట్ల బీజేపీ సభ్యులు నిశికాంత్‌ దూబే, ప్రహ్లాద్‌ జోషీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. వీటిపై లోక్‌సభ సెక్రెటేరియట్‌ రాహుల్‌కు లేఖ రాసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement