BJP Strong Counter To Congress's 9 Years 9 Questions Criticism - Sakshi
Sakshi News home page

‘9 ఏళ్ల పాలన.. 9 ప్రశ్నలు.. మోదీపై విద్వేషంతోనే ఇదంతా..’

Published Sat, May 27 2023 7:27 AM | Last Updated on Sat, May 27 2023 9:11 AM

BJP Counter To Congress 9 Years 9 Questions Criticism - Sakshi

ఢిల్లీ: తొమ్మిదేళ్ల మోదీ పాలనపై కాంగ్రెస్‌ పార్టీ సంధించిన ప్రశ్నలన్నీ అబద్ధాల పుట్టలేనని బీజేపీ దుయ్యబట్టింది. కేవలం మోదీపై కాంగ్రెస్‌కు ఉన్న విద్వేషం నుంచి అవి పుట్టుకొచ్చాయని  బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కౌంటర్‌ దాడి చేశారు.  ఈ మేరకు శుక్రవారం ఫ్యాక్ట్‌ చెక్‌ పేరిట.. పలు గణాంకాలను వివరిస్తూ మీడియా సమావేశం నిర్వహించారాయన.

విమర్శలు చేసే హక్కు వాళ్లకు(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) ఉంది. కానీ, ఇది విమర్శల నుంచి ఉత్పన్నమయిన ప్రశ్నలు కావు.  కేవలం ప్రధానిపై కాంగ్రెస్‌కున్న ద్వేషంతోనే తెరపైకి వచ్చాయి. అది వాళ్లకు ఉన్న ఒక రోగం అని  విమర్శించారు. మోదీ హయాంలో భారత్‌ ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. ఈ ప్రశ్నలన్నీ ఫ్రస్టేషన్‌లో చేస్తున్నవే. కరోనా టైంలో వైఫల్యాలపై కాంగ్రెస్‌ నిలదీయడంపైనా ఆయన స్పందించారు.

‘‘అది అబద్దం మాత్రమే కాదు.. కాంగ్రెస్‌ సిగ్గులేనితనం తారాస్థాయికి చేరిందనడానికి నిదర్శనం’’ అని మండిపడ్డారాయన. ప్రపంచం మొత్తం భారత్‌ కరోనా సమయంలో వ్యవహరించిన తీరును అభినందించాయి. కానీ, కాంగ్రెస్‌ మాత్రం ఇక్కడి ఫ్రంట్‌లైన్‌ వారియర్లను తీవ్రంగా అగౌరవపరుస్తోందని, దానిని ఖండిస్తున్నామని అన్నారాయన. అలాగే..  దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి 9 ఏళ్లలో దేశ వృద్ధిని వివరిస్తామని తెలిపారాయన. 

ఇదీ చదవండి: అది రాజదండం కాదు!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement