
ఆమ్‌స్టర్‌డ్యామ్: నెదర్లాండ్ రెండు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. ఆమ్‌స్టర్‌డామ్‌లోని డామ్ స్క్వేర్ వద్ద సైనిక వందనం స్వీకరించారు రాష్ట్రపతి కోవింద్. రాజు అలగ్జాండర్, రాణి మాగ్జిమా రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు భారత రాష్ట్రపతి. ప్రధాని మార్క్ రూటెతో చర్చలు జరపనున్నారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం క్యుకెన్‌హాఫ్‌ను సందర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment