ఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపివేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సుశాంత్ మరణంపై పలు అనుమానాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్‌లో సినీ ప్రముఖులు ప్రతిభను ప్రోత్సాహించరని.. కేవలం బంధుప్రీతి చూపిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ జీవితంపై రెండు, మూడు బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఈ చిత్రాలను నిలిపివేయాల్సింది కోరుతూ మంగళవారం ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న కోర్టు సుశాంత్‌పై తెరకెక్కుతున్న చిత్రాలను నిలిపివేయాల్సిందిగా నిర్మాతలకు సమన్లు జారీ చేసింది.
తన కొడుకు చావును పలు నిర్మాణ సంస్థలు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయనీ సుశాంత్ సింగ్ తండ్రి ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు. కాగా, సుశాంత్ సింగ్ తండ్రి తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టులో వాదనలను వినిపించారు. సుశాంత్ సింగ్ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని, అతనిపై వచ్చే బయోపిక్ సినిమాలు కేసుపై ప్రభావం చూపుతాయని కోర్టుకు విన్నవించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తోందని, తీర్పు ఇంకా పెండింగ్‌లో ఉందని కోర్టుకు తెలిపారు. పిటిషన్‌లో ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్ అండ్ శశాంక్’ వంటి చిత్రాలను ప్రస్తావించారు. అంతేకాకుండా కుటుంబసభ్యుల సమ్మతి లేకుండా ఈ సినిమాలను తీస్తున్నారని కోర్టుకు వివరించారు.
ప్రస్తుతం బాలీవుడ్ సుశాంత్ జీవితం ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్ అండ్ శశాంక్’ సినిమాలు రూపొందుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఇప్పటివరకు అతని జీవితంపై మూడు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఒక వార్తా నివేదిక ప్రకారం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోగ్రఫీ, సుశాంత్, రాజ్‌పుత్: ది ట్రూత్ విన్స్ , ది అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ సినిమాలకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
‘సుశాంత్ సింగ్ చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు...!’
Published Tue, Apr 20 2021 8:22 PM | Last Updated on Tue, Apr 20 2021 9:26 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment