న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంఖ్య సెప్టెంబర్‌లో పెరిగింది. సమీక్షా నెలలో మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను పరిశీలిస్తే, వీటిలో కోవిడ్–19 చికిత్స సంబంధిత క్లెయిమ్స్ 40 శాతానికి ఎగశాయని తమ గణాంకాల విశ్లేషణలో వెల్లడైనట్లు ఈ రంగంలో దిగ్గజ అగ్రిగేటర్ పాలసీబజార్ డాట్ కామ్ పేర్కొంది. నెలల వారీగా ఈ శాతాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. దీనిప్రకారం, మేలో ఈ రేటు కేవలం 8 శాతం ఉంటే, జూలై, ఆగస్టుల్లో వరుసగా 23, 34 శాతాలకు చేరింది. పాలసీబజార్ డాట్ కామ్లో ఆరోగ్య బీమా విభాగం చీఫ్ అమిత్ ఛబ్రా వివరించిన అంశాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే...
► కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ దాఖలు చేసిన వారిలో అత్యధికులు 60 సంవత్సరాలవారు ఉన్నారు. తరువాతి శ్రేణిలో 41 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు్కలు ఉన్నారు. చదవండి: ఆ నష్టం రూ.1.25 లక్షల కోట్లు
►కరోనా కేసుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లోనే భారీగా పెరిగింది. రికవరీ కూడా అధికంగా ఉంది.
►ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య చూస్తే, మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ వాటా 26 శాతంగా ఉంది. నాన్–కోవిడ్–19 విషయంలో ఈ రేటు 74 శాతంగా ఉంది. ఈ విభాగంలోకి గుండె, ఊపిరితిత్తులు, నాడీ సంబంధ సమస్యలు వచ్చాయి.
►క్లెయిమ్‌లకు సంబంధించి విలువ సగటున రూ.1,18,000గా ఉంది. అయితే ఒక్క 46–50 మధ్య వయస్సువారి విషయంలో క్లెయిమ్ విలువ గరిష్టంగా రూ.2.19 లక్షలుగా ఉంది.
►బీమా రెగ్యులేటరీ సంస్థ– ఐఆర్‌డీఏఐ కోవిడ్–19 ప్రత్యేక పాలసీలకు అనుమతినిచ్చిన తొలి నెలల్లో వీటి కొనుగోలుకు డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు సమగ్ర హెల్త్ కవర్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్–10 బీమాల వైపు నుంచి మరింత సమగ్ర ప్రణాళికలవైపు మారడానికి ప్రజలకు అనుమతినిస్తూ, ఐఆర్‌డీఏఐ ఇచి్చన అనుమతులు హర్షణీయం.
►నెలవారీ ప్రీమియం పేమెంట్ విధానానికి అనుమతించడం హర్షించదగిన మరో కీలకాంశం. ఇప్పుడు 35 సంవత్సరాల ఒక వ్యక్తి రూ.1,000 నుంచి రూ.1,500 నెలకు చెల్లించి కోటి రూపాయల వరకూ బీమా కవర్ పొందగలుగుతున్నాడు.
►నాన్–కోవిడ్–19 క్లెయిమ్స్ విషయానికి వస్తే, ఆసుపత్రుల్లో బెడ్ల వినియోగం ఇప్పుడు గణనీయంగా పెరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన రోగులు ఇప్పుడు చికిత్స, ఆపరేషన్లకోసం పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతుండడమే దీనికి కారణం.
►పెద్దల్లో కంటి సంబంధ ఇబ్బందులు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. 61 సంవత్సరాలు పైబడి ఆరోగ్య బీమా ఉన్న సీనియర్ సిటిజన్‌లలో దాదాపు 20 శాతం కంటి సంబంధ చికిత్సలకు బీమా సౌలభ్యతను వినియోగించుకుంటున్నారు.
తగ్గనున్న ఆసుపత్రుల లాభం :క్రిసిల్
కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ లాభం సుమారు 35–40% తగ్గనుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. వైరస్ భయంతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళకపోవడం,చికిత్సలను వాయిదా వేసుకోవడం దీనికి ప్రధాన కారణంగా తెలిపింది. ఏజెన్సీ.. రేటింగ్ ఇచి్చన 36 ఆసుపత్రులతో కలిపి మొత్తం 40 హాస్పిటల్స్‌ను విశ్లేషించి రూపొందిన ఈ నివేదిక ప్రకారం.. కోవిడ్ కేసులు ఎక్కువగా వచి్చనప్పటికీ వీటి ద్వారా పొందిన మార్జిన్ తక్కువగా ఉంది. అయితే ఈ కేసుల నుంచి అదనంగా 15–20 శాతం ఆదాయం సమకూరింది. లాక్‌డౌన్, ప్రయాణ సడలింపులతో జులై నుంచి రోగుల రాక క్రమంగా మెరుగు పడుతూ వచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment