భారత్‌లో షియోమీ ఫోన్లను బ్యాన్ చేయండి | Philips Seeks Ban on Xiaomi Phone Sale in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో షియోమీని బ్యాన్ చేయండి

Dec 3 2020 11:24 AM | Updated on Dec 3 2020 12:44 PM

Philips Seeks Ban on Xiaomi Phone Sale in India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఫిలిప్స్ కంపెనీ షియోమీ మీద కేసు వేసింది. షియోమీ తమ పేటెంట్ల సహాయంతో రూపొందించిన మొబైల్ ఫోన్లలను అమ్మకుండా నిషేధించాలని కోరుతూ ఫిలిప్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. షియోమి ఇండియాపై చర్యలను తీసుకోవాలని కోరుతూ కంపెనీ పేటెంట్ల నియమాన్ని ఉల్లంఘించి తయారుచేసిన షియోమి ఫోన్ల అమ్మకాలను నిషేధించాలని కంపెనీ హైకోర్టును కోరింది. తమ టెక్నాలజీతో రూపొందించిన ఉత్పత్తులను షియోమి సొంత, థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల ద్వారా జరిగే అమ్మకాలను నిషేధించడం మాత్రమే కాకుండా వాటి తయారీ, దిగుమతి మరియు ప్రకటనలను కూడా నిలిపివేయాలని టెక్ దిగ్గజం హైకోర్టును కోరింది. షియోమి నుండి హెచ్‌ఎస్‌పిఎ, హెచ్‌ఎస్‌పిఎ +, ఎల్‌టిఇ టెక్నాలజీలను కలిగి ఉన్న కొన్ని ఫోన్‌లను పేటెంట్ల ఉల్లంఘన కారణంగా వీటిని నిషేదించాలని కోర్టును కోరింది. (చదవండి: ఇన్‌స్టాగ్రాం: ఒకేసారి నలుగురితో లైవ్

ఫిలిప్స్ తన అభ్యర్ధనలో "సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కు ఆదేశాలు ఇచ్చి పేటెంట్ల నియమాన్ని ఉల్లంఘించి తయారుచేసిన మోడళ్లతో సహా, షియోమి మొబైల్ హ్యాండ్‌సెట్ల దిగుమతిని అనుమతించకుండా ఉండటానికి భారతదేశంలోని ప్రతి ఓడరేవు వద్ద  కస్టమ్ అధికారులకు అధికారం ఇవ్వమని కోర్టును కోరింది". ఈ కేసు తదుపరి విచారణను 20 జనవరి 2021 తేదీకి వాయిదా వేసింది. ఈ విషయంపై మరింత స్పష్టత ఆ రోజు లభించనుంది. ఈ విషయంపై టెక్ దిగ్గజం షియోమి నుండి ఎటువంటి అధికారికంగా స్పందన రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement