philips
-
IPL 2024 Final: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు!?
క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్-2024 తుది దశకు చేరుకుంది. ఆదివారం(మే 26) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ట్రోఫీని ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ హైవోల్ట్‌జ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌కు తమ ప్లేయింగ్ ఎల్వెన్లో ఒకే మార్పు చేయాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ స్దానంలో కివీ స్టార్ గ్లెన్ ఫిలిప్స్‌ను అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్లో ఫిలిప్స్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఛాన్స్ ఇవ్వలేదు. క్వాలిఫయర్-2కు అయినా ఫిలిప్స్‌కు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ అతడిని కాదని మార్క్రమ్ ఛాన్స్ ఇచ్చింది. మార్క్రమ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలోనే మార్క్రమ్పై వేటు వేసి ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నట్ల వినికిడి.సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కత్ -
#Glen Phillips: ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వచ్చాడా.. ? కనీసం ఒక్క ఛాన్స్ కూడా
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఐడైన్ మార్క్రమ్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో మార్క్రమ్ తీవ్రనిరాశ పరిచాడు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి తుది జట్టుకు దూరంగా ఉంటున్న మార్క్రమ్కు ఈ మ్యాచ్‌లో అనుహ్యంగా చోటుదక్కింది.అయితే మెనెజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మార్క్రమ్ వమ్ము చేశాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్రమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో మార్క్రమ్తో పాటు జట్టు మెనెజ్మెంట్పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వరుసగా విఫలమైన ఆటగాడికి కీలక మ్యాచ్‌లో ఎందుకు ఛాన్స్ ఇచ్చారని మండిపడుతున్నారు. అతడికి బదులుగా కివీస్ సూపర్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ ఛాన్స్ ఇవ్వల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది అయితే ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వచ్చాడా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఫిలిప్స్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో ఎక్స్‌లో #గ్లెన్ ఫిలిప్స్ అనే కీవర్డ్ ట్రెండ్ అవుతోంది. -
6 వేల మందిపై ‘ఫిలిప్స్’ కంపెనీ వేటు...కారణం ఇదే
ప్రముఖ వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ వరల్డ్ వైడ్‌గా వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు నెలల ముందు ఫిలిప్స్ సంస్థ 4వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. తాజాగా సిబ్బందికి పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు జాకబ్స్ తెలిపారు. ఇది కష్టతరమైన సమయం, కానీ తప్పడం లేదంటూ ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. 2025 నాటికి వర్క్ ఫోర్స్‌ను మరింత తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 3వేల మందిని, 2025 నాటికి మొత్తం 6వేల మందిని తొలగిస్తామని అన్నారు. ఫిలిప్స్ సంస్థ నిద్రలేమని సమస్యతో బాధపడే వారి కోసం స్లీప్ రెస్పిరేటర్లను చేసింది. వాటి వల్ల వినియోగదారులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తూ రెస్పిరేటర్లను రీకాల్ చేసింది. వెరసీ ఫిలిప్స్ కంపెనీ గత ఏడాది క్యూ4లో సుమారు 114 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది మొత్తం ఆ కంపెనీ సుమారు 1.605 బిలియన్ల యూరోలు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. -
4 వేలమంది ఉద్యోగుల్ని ఫైర్ చేసిన ఫిలిప్స్... కారణం ఇదే
-
ప్చ్.. తప్పడం లేదు, 4వేల మంది ఉద్యోగుల్ని తొలగించిన టెక్ దిగ్గజం
ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఫిలిప్స్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. క్యూ3 ఫలితాల విడుదల సందర్భంగా..‘ప్రొడక్టివిటీ, యాక్టివిటీని పెంచండి’ అంటూ సంస్థకు చెందిన 4వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. క్యూ3 ఫలితాల వెలువరించిన అనంతరం.. ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకోబ్స్ మాట్లాడుతూ.. ఉద్యోగులపై వేటు కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదు. వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.సంస్థ విక్రయాల విలువ 4.3 బిలియన్ యూరోస్ ఉండగా..అందులో 5శాతం తగ్గినట్లు పేర్కొంది. సప్లయి చైన్ల ప్రభావం కంపెనీ సేల్స్‌పై పడిందని ఫిలిఫ్స్ సంస్థ పేర్కొంది. ఫిలిప్స్ లాభాల బాట పడుతూ.. సంస్థ వాటాదారుల విలువను సృష్టించేలా సంస్థ ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం. త్రైమాసికంలో ఫిలిప్స్ పనితీరు కార్యాచరణ, సప్లై చైన్ , ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు సంస్థ పనితీరుపై ప్రభావం చూపినట్లు వెల్లడించారు. చదవండి👉టెక్ కంపెనీల్లో..మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ. -
ఫిలిప్స్ భారీ పెట్టుబడులు, ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: కన్స్యూమర్ డ్యూరబుల్స్ దిగ్గజం ఫిలిప్స్ ఇండియాలో భారీ పెట్టుబడులపై దృష్టి పెట్టింది. దేశంలో రూ.300 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నామని సంస్థ గ్లోబల్ సీఈఓ ఫ్రాన్స్ వాన్ హౌటెన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశంలో 1500 మంది ఉద్యోగులను నియమించాలని కూడా యోచిస్తోందని తెలిపారు. దేశంలో సంస్థ కార్యకలాపాలను విస్తరించనున్నామని ఫిలిప్స్ గ్లోబల్ సీఈవో ప్రకటించారు. పుణేతో విస్తరణతోపాటు, సాఫ్ట్వేర్ వనరులు ఎక్కువగా ఉండే బెంగళూరులోని తమ ఇన్నోవేషన్ సెంటర్ కార్యకలాపాలకు ప్రాముఖ్యతనిస్తామన్నారు. అలాగే చెన్నైలోని తమ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌ను కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో మొత్తంగా 1500 మంది కొత్త ఉద్యోగులను ఎంపిక చేయనున్నామని చెప్పారు. ఫిలిప్స్ భారతదేశంపై దృష్టి సారించిందని, ఇది ఒక గొప్ప మార్కెట్ అని నమ్ముతున్నామని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో వెంటిలేటర్లు,మానిటర్లు వంటి క్లిష్టమైన సంరక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచామన్నారు. భారతదేశంలో అనేక పథకాలున్నప్పటికీ ఆరోగ్య సంరక్షణ అనేది పెద్ద సమస్యగా మారిందన్నారు మౌలిక సదుపాయాల ప్రాపత్య సవాలుగా మిగిలిపోయిన ప్రస్తుత తరుణంలో మౌలిక పరికరాలను, సదుపాయాలను అభివృద్ధి చేసి వారికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని వాన్ హౌటెన్ అన్నారు. -
భారత్‌లో షియోమీ ఫోన్లను బ్యాన్ చేయండి
న్యూఢిల్లీ: ఫిలిప్స్ కంపెనీ షియోమీ మీద కేసు వేసింది. షియోమీ తమ పేటెంట్ల సహాయంతో రూపొందించిన మొబైల్ ఫోన్లలను అమ్మకుండా నిషేధించాలని కోరుతూ ఫిలిప్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. షియోమి ఇండియాపై చర్యలను తీసుకోవాలని కోరుతూ కంపెనీ పేటెంట్ల నియమాన్ని ఉల్లంఘించి తయారుచేసిన షియోమి ఫోన్ల అమ్మకాలను నిషేధించాలని కంపెనీ హైకోర్టును కోరింది. తమ టెక్నాలజీతో రూపొందించిన ఉత్పత్తులను షియోమి సొంత, థర్డ్ పార్టీ వెబ్సైట్ల ద్వారా జరిగే అమ్మకాలను నిషేధించడం మాత్రమే కాకుండా వాటి తయారీ, దిగుమతి మరియు ప్రకటనలను కూడా నిలిపివేయాలని టెక్ దిగ్గజం హైకోర్టును కోరింది. షియోమి నుండి హెచ్‌ఎస్‌పిఎ, హెచ్‌ఎస్‌పిఎ +, ఎల్‌టిఇ టెక్నాలజీలను కలిగి ఉన్న కొన్ని ఫోన్లను పేటెంట్ల ఉల్లంఘన కారణంగా వీటిని నిషేదించాలని కోర్టును కోరింది. (చదవండి: ఇన్స్టాగ్రాం: ఒకేసారి నలుగురితో లైవ్) ఫిలిప్స్ తన అభ్యర్ధనలో "సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కు ఆదేశాలు ఇచ్చి పేటెంట్ల నియమాన్ని ఉల్లంఘించి తయారుచేసిన మోడళ్లతో సహా, షియోమి మొబైల్ హ్యాండ్సెట్ల దిగుమతిని అనుమతించకుండా ఉండటానికి భారతదేశంలోని ప్రతి ఓడరేవు వద్ద కస్టమ్ అధికారులకు అధికారం ఇవ్వమని కోర్టును కోరింది". ఈ కేసు తదుపరి విచారణను 20 జనవరి 2021 తేదీకి వాయిదా వేసింది. ఈ విషయంపై మరింత స్పష్టత ఆ రోజు లభించనుంది. ఈ విషయంపై టెక్ దిగ్గజం షియోమి నుండి ఎటువంటి అధికారికంగా స్పందన రాలేదు. -
14 దేశాలకు విస్తరించిన ‘ప్రీతి’
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగు దశాబ్దాలుగా వంటింటి ఉపకరణాల్లో దిగ్గజ బ్రాండ్‌గా రాణిస్తున్న ఫిలిప్స్ ఇండియా అనుబంధ సంస్థ ‘ప్రీతి’ కిచెన్ అప్లయన్సెస్ ఉత్పత్తులు, ప్రస్తుతం 14 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు సంస్థ ఎండీ సుబ్రమణియన్ శ్రీనివాసన్ చెప్పారు. 1978లో ఏర్పాటు చేసిన ప్రీతి సంస్థ 40వ వార్షికోత్సవం సందర్బంగా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రీతి ఉత్పత్తుల తయారీ ప్లాంట్‌ను ‘రాయల్ ఫిలిప్స్’ పర్సనల్ హెల్త్ చీఫ్ బిజినెస్ లీడర్ రాయ్ జాకబ్స్ చేతుల మీదుగా శుక్రవారం చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసన్ మాట్లాడుతూ... ప్రీతి నుంచి 13 రకాల ఉత్పత్తులు అందిస్తున్నట్లు తెలియజేశారు. మిక్సర్, గ్రైండర్ కేటగిరిలో ప్రీతి ఉత్పత్తులు దేశంలో పదేళ్లుగా ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయని చెప్పారు. ‘‘దేశంలోని ఎనిమదిది రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు, 96 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. కిచెన్ ఉత్పత్తుల అమ్మకాల్లో 20 శాతం వాటా మాదే. ఇక్కడి నుంచే 14 దేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాం’’ అని శ్రీనివాసన్ వివరించారు. ‘‘ఇప్పటిదాకా మా తయారీ సామర్థ్యం ఏడాదికి 80 వేల యూనిట్లు. తాజా ప్లాంటు పూర్తి సామర్థ్యం 2 మిలియన్లు. కొత్త ఫ్యాక్టరీ ద్వారా ప్రస్తుతం ఉత్పత్తిని 1.20 మిలియన్ యూనిట్లకు చేరుస్తాం’’ అని చెప్పారాయన. -
సెబాస్టియన్..ఓ కబ్జా కోరు
-
సెబాస్టియన్..ఓ కబ్జా కోరు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందుతుడిగా ఉన్న సెబాస్టియన్ హారీకి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అద్దెకి దిగిన ఇంటినే కబ్జా చేయాలని చూస్తున్నాడని యజమాని ఫిలిప్స్ అవేదన వ్యక్తం చేశారు. 2003 లో సెబాస్టియన తన భార్య పేరు మీద ఎర్రగడ్డలోని తమ ఇంట్లో అద్దెకి దిగాడని చెప్పారు. 2008 లో తమకే ఇళ్లు అవసరం ఉందని ఖాళీ చేయాల్సిందిగా కోరగా, వాళ్ల బాబుకు పరీక్షలు ఉన్నాయని చెప్పి.. ఆ తర్వాత ఖాళీ చేయడానికి నిరాకరించారని చెప్పారు. దీంతో కోర్టును కూడా ఆశ్రయించగా, తన సంతకం ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించి స్టే తీసుకొచ్చారని పిలిప్స్ ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదని, మానసింగా ఇబ్బందిపెడుతున్నాడని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ఇళ్లలో హై రెసొల్యూషన్ తో అమర్చిన సీసీ కెమెరాలు విచారణలో కీలకంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పూర్తి ఫూటేజిని ఏసీబీ అధికారులు సేకరించారు.