ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఫిలిప్స్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. క్యూ3 ఫలితాల విడుదల సందర్భంగా..‘ప్రొడక్టివిటీ, యాక్టివిటీని పెంచండి’ అంటూ సంస్థకు చెందిన 4వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
క్యూ3 ఫలితాల వెలువరించిన అనంతరం.. ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకోబ్స్ మాట్లాడుతూ.. ఉద్యోగులపై వేటు కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదు. వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.సంస్థ విక్రయాల విలువ 4.3 బిలియన్ యూరోస్ ఉండగా..అందులో 5శాతం తగ్గినట్లు పేర్కొంది. సప్లయి చైన్‌ల ప్రభావం కంపెనీ సేల్స్‌పై పడిందని ఫిలిఫ్స్ సంస్థ పేర్కొంది.
ఫిలిప్స్ లాభాల బాట పడుతూ.. సంస్థ వాటాదారుల విలువను సృష్టించేలా సంస్థ ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం. త్రైమాసికంలో ఫిలిప్స్ పనితీరు కార్యాచరణ, సప్లై చైన్ , ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు సంస్థ పనితీరుపై ప్రభావం చూపినట్లు వెల్లడించారు.
చదవండి👉టెక్ కంపెనీల్లో..మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ.
Comments
Please login to add a commentAdd a comment