
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగు దశాబ్దాలుగా వంటింటి ఉపకరణాల్లో దిగ్గజ బ్రాండ్‌గా రాణిస్తున్న ఫిలిప్స్ ఇండియా అనుబంధ సంస్థ ‘ప్రీతి’ కిచెన్ అప్లయన్సెస్ ఉత్పత్తులు, ప్రస్తుతం 14 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు సంస్థ ఎండీ సుబ్రమణియన్ శ్రీనివాసన్ చెప్పారు. 1978లో ఏర్పాటు చేసిన ప్రీతి సంస్థ 40వ వార్షికోత్సవం సందర్బంగా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రీతి ఉత్పత్తుల తయారీ ప్లాంట్‌ను ‘రాయల్ ఫిలిప్స్’ పర్సనల్ హెల్త్ చీఫ్ బిజినెస్ లీడర్ రాయ్ జాకబ్స్ చేతుల మీదుగా శుక్రవారం చెన్నైలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసన్ మాట్లాడుతూ... ప్రీతి నుంచి 13 రకాల ఉత్పత్తులు అందిస్తున్నట్లు తెలియజేశారు. మిక్సర్, గ్రైండర్ కేటగిరిలో ప్రీతి ఉత్పత్తులు దేశంలో పదేళ్లుగా ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయని చెప్పారు. ‘‘దేశంలోని ఎనిమదిది రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు, 96 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. కిచెన్ ఉత్పత్తుల అమ్మకాల్లో 20 శాతం వాటా మాదే. ఇక్కడి నుంచే 14 దేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాం’’ అని శ్రీనివాసన్ వివరించారు. ‘‘ఇప్పటిదాకా మా తయారీ సామర్థ్యం ఏడాదికి 80 వేల యూనిట్లు. తాజా ప్లాంటు పూర్తి సామర్థ్యం 2 మిలియన్లు. కొత్త ఫ్యాక్టరీ ద్వారా ప్రస్తుతం ఉత్పత్తిని 1.20 మిలియన్ యూనిట్లకు చేరుస్తాం’’ అని చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment