క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్-2024 తుది దశకు చేరుకుంది. ఆదివారం(మే 26) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ట్రోఫీని ముద్దాడాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ హైవోల్ట్‌జ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌కు తమ ప్లేయింగ్ ఎల్‌వెన్‌లో ఒకే మార్పు చేయాలని ఎస్‌ఆర్‌హెచ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్‌క్రమ్ స్దానంలో కివీ స్టార్ గ్లెన్ ఫిలిప్స్‌ను అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్‌లో ఫిలిప్స్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఛాన్స్ ఇవ్వలేదు. క్వాలిఫయర్-2కు అయినా ఫిలిప్స్‌కు ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు.
కానీ ఎస్‌ఆర్‌హెచ్ మెనెజ్‌మెంట్ అతడిని కాదని మార్‌క్రమ్ ఛాన్స్ ఇచ్చింది. మార్‌క్రమ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలోనే మార్‌క్రమ్‌పై వేటు వేసి ఫిలిప్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నట్ల వినికిడి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కత్
Comments
Please login to add a commentAdd a comment